twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The WARRIORR 6 Days Collections: రామ్‌కు మరో దెబ్బ.. 6వ రోజు షాకింగ్‌గా.. టోటల్‌గా వచ్చింది ఎంతంటే!

    |

    బడా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు ఉస్తాద్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ ట్రాక్ ఎక్కి.. ఆ వెంటనే 'రెడ్'తో మరో విజయాన్ని అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు రామ్ 'ది వారియర్' అనే సినిమాతో వచ్చాడు. క్రేజీ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    ది వారియర్‌గా రచ్చ చేసిన రామ్

    ది వారియర్‌గా రచ్చ చేసిన రామ్

    ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీ తెరకెక్కించిన మాస్ మూవీనే 'ది వారియర్'. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ అయింది.

    లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

    ది వారియర్ బిజినెస్ వివరాలివే

    ది వారియర్ బిజినెస్ వివరాలివే


    మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ది వారియర్' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 5 కోట్లు, మిగిలిన ఆంధ్రా ఏరియాలో రూ. 15 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 4 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ. 38.10 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.

    6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    6వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ది వారియర్'కు మరో దెబ్బ తగిలింది. దీంతో ఈ మూవీకి నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 57 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

    దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!

    6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    ఏపీ, తెలంగాణలో 'ది వారియర్' 6 రోజుల్లో పెద్దగా రాణించలేదు. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.22 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.23 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.84 కోట్లు, కృష్ణాలో రూ. 88 లక్షలు, నెల్లూరులో రూ. 60 లక్షలతో కలిపి రూ. 15.93 కోట్లు షేర్, రూ. 24.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

    6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    6 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    ఏపీ, తెలంగాణలో 'ది వారియర్' 6 రోజుల్లో పెద్దగా రాణించలేదు. దీంతో ఈ సినిమా నైజాంలో రూ. 5.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.22 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.23 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.84 కోట్లు, కృష్ణాలో రూ. 88 లక్షలు, నెల్లూరులో రూ. 60 లక్షలతో కలిపి రూ. 15.93 కోట్లు షేర్, రూ. 24.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసుకుంది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?


    6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 15.93 కోట్లు వసూలు చేసిన 'ది వారియర్' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ సోసోగానే రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షలు, తమిళంలో రూ. 1.00 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో 6 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.43 కోట్లు షేర్‌, రూ. 31.05 కోట్ల గ్రాస్ వచ్చింది.

    నిధి అగర్వాల్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌లో ఆమెనిలా చూశారంటే!నిధి అగర్వాల్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌లో ఆమెనిలా చూశారంటే!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    రామ్ - కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 6 రోజుల్లో రూ. 18.43 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 20.57 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌‌ను అందుకుంటుంది.

    English summary
    Ram Pothineni Did The WARRIORR Movie Under Kollywood Director Lingusamy Direction. This Movie Collects Rs 18.43 Cr in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X