twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ ఫైట్: అల్లుడు అదుర్స్ vs రెడ్.. థియేటర్స్ కోసం గొడవలు.. చివరికి ఎంత రాబట్టారంటే?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి అనగానే బాక్సాఫీస్ వద్ద ఒక తెలియని సందడి నెలకొంటుంది. అయితే ఈ సారి కరోనా లాక్ డౌన్ వల్ల కలెక్షన్స్ డోస్ కాస్త తగ్గినప్పటికీ రాబోయే సినిమాలకు ఒక విధంగా సంక్రాంతి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక జనవరి 14న రెడ్ సినిమాతో పాటు అల్లుడు అదుర్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమా మొదటిరోజు దక్కించుకున్న కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

     థియేటర్స్ కోసం గొడవలు?

    థియేటర్స్ కోసం గొడవలు?


    రామ్ పోతినేని కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా రెడ్. తమిళ్ తడమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక మరో సినిమా అల్లుడు అదుర్స్ కమర్షియల్ హంగులతో అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ రెండు సినిమాలు థియేటర్స్ కోసం చివరి వరకు గట్టిగానే పోరాడినట్లు టాక్ వస్తోంది.

    సాలీడ్ ఓపెనింగ్స్..

    సాలీడ్ ఓపెనింగ్స్..

    ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో థియేటర్స్ కోసం గొడవలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చివరికి రెడ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ లభించాయి. ఆ విషయం పక్కన పెడితే.. సినిమా కలెక్షన్స్ మొదటి రోజు బాగానే వచ్చాయి. హాలిడేస్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాలకు బాగానే ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇక రెడ్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ను అందుకున్నట్లు సమాచారం.

    రామ్ రెడ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..

    రామ్ రెడ్ ఎంత కలెక్ట్ చేసిందంటే..


    ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమా అనంతరం రామ్ పోతినేని చేస్తున్న సినిమా కాబట్టి బాక్సాఫీస్ వద్ద అంచనాలు కూడా బాగానే పెరిగాయి. ఇక సినిమా మొదటిరోజు రూ.5కోట్ల వరకు షేర్స్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్ కేవలం 50% కెపాసిటీ సిట్టింగ్ తో నడుస్తున్నప్పటికి టికెట్స్ రేట్లు పెంచడంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

     అల్లుడు అదుర్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

    అల్లుడు అదుర్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..

    ఇక అల్లుడు అదుర్స్ విషయానికి వస్తే.. ఈ సారి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు థియేటర్స్ సంఖ్య చాలా తక్కువగానే వచ్చినట్లు సమాచారం. సినిమా మొదటిరోజు 1.3కోట్ల షేర్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్సీడ్ టాక్ వస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద మొదటి వారంలో ఏ రేంజ్ లో లాభాలను అందుకుంటుందో చూడాలి.

    English summary
    Wallpapers in the Tollywood industry means an unknown buzz at the box office. This time, however, the collection dose was slightly reduced due to the corona lock down, but in a way, the wallpapers gave a good boost to the wallpapers. It is known that on January 14, along with the movie Red, his son-in-law Adurs came forward to the audience. If you take a look at the collections obtained on the first day of the movie .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X