Just In
- 7 hrs ago
చిరంజీవి సినిమా ఫస్ట్‌షోకు వెళ్లా.. స్టెప్పులు డ్యాన్సులు చేశా.. మంత్రి అజయ్ కుమార్
- 8 hrs ago
రైతు బిడ్డ రైతే కావాలి.. ఆ రోజు వస్తుంది.. వ్యవసాయం లాభసాటిగా.. ఆవేశంగా ప్రసంగించిన చిరంజీవి
- 8 hrs ago
చిరంజీవి వారసత్వం ఎవ్వరికీ దక్కదు... ఆ స్థాయి ఆ ఒక్కడికే.. శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
- 9 hrs ago
శర్వానంద్ నా బిడ్డలాంటి వాడు.. రాంచరణ్ ఫోన్ చేసి.. శ్రీకారం ఫంక్షన్లో చిరంజీవి ఎమోషనల్
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి విద్యార్థులు ఈరోజు ఫోన్, టివికి దూరంగా ఉండాలి...
- News
మోడీపై దీదీ గుస్సా.. దేశం పేరు కూడా మారుస్తారని ధ్వజం
- Finance
భారీగా పడిపోయిన బంగారం ధరలు, 10 గ్రాములు రూ.44,200 మాత్రమే!
- Sports
India vs England: 'సాహా అత్యుత్తమ కీపర్.. కొంతకాలం రెండో కీపర్‌గా కొనసాగించాలి'
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RED box office.. మొదటి రోజే అన్నికోట్లు కొల్లగొట్టిందట.. కలెక్షన్లపై రామ్ పోస్ట్ వైరల్
ఉస్తాద్ ఇస్మార్ట్ రామ్ హీరోగా వచ్చిన RED చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి బోణి కొట్టింది. అందరి అంచనాలు మించేలా మొదటి రోజు రఫ్ఫాడించింది. అందరి కళ్లు చెదిరేలా కలెక్షన్లు సాధించింది. యాభై శాతం అక్యుపెన్సీ అయినా కూడా రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టేసింది. కాసేపటి క్రితమే RED మూవీపై అఫీషియల్ పోస్టర్‌ను రామ్ షేర్ చేశాడు. ఇంతలా భారీ ఓపెనింగ్స్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రామ్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు.

రామ్ స్పెషల్ ఎనర్జీ..
ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ సినిమా తరువాత RED వంటి విభిన్న కథను ఎంచుకున్నాడు. కెరీర్‌లో మొదటి సారిగా ద్విపాత్రాభినయం వేయడంతో అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టుగానే సినిమా ఉండటంతో కలెక్షన్లు ఓ రేంజ్‌లో వచ్చాయి. మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని చిత్రాలకంటే రామ్ RED ముందు ఉందని తెలుస్తోంది.

మొదటి రోజే..
రామ్ RED సినిమా మొదటి రోజే 8.9 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని సమాచారం అందింది. ఇక ఏరియా వారీగా చూస్తే.. నైజాంలో 2.04కోట్లు, సీడెడ్‌లో 1.10కోట్లు, ఉత్తరాంధ్రలో 49లక్షలు, ఈస్ట్ 36లక్షలు, వెస్ట్ 46 లక్షలు, గుంటూరు 42 లక్షలు, కృష్ణా 32 లక్షలు, నెల్లూరులో 28 లక్షలు కొల్లగొట్టింది.

లెక్కలు అలా..
RED సినిమా అలా మొత్తంగా 5.47 కోట్ల షేర్‌ను సాధించిందని ప్రాథమికంగా సమాచారం వచ్చింది. కానీ తాజాగా అసలు లెక్కలు బయటకు వచ్చాయి. RED నుంచి మొదటి రోజు లెక్కలు అఫీషియల్‌గా వచ్చేశాయి. రామ్ ఈ మేరకు ఓ పోస్టర్‌ను షేర్ చేశాడు.

అఫీషియల్ లెక్కలు ఇలా..
RED సినిమా మొదటి రోజే 6.7 కోట్ల షేర్ కొల్లగొట్టిందని ప్రకటించేశారు. ఈక్రమంలో రామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. REDను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్.. మాస్కులు ధరించి సినిమాను ఎంజాయ్ చేయండని కోరాడు. ఇక పోస్టర్‌పై పరిమితంగా రిలీజైంది.. కానీ ప్రేమ మాత్రం అపరిమితంగా వచ్చిందంటూ చెప్పుకొచ్చారు.

మొత్తం ఎంత కొల్లగొట్టాలంటే..
RED ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కి 16.5 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో... 10.45 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్‌ని దక్కించుకుంటుంది. అంటే ఇంకో రెండు మూడు రోజులు కూడా ఇదే ఊపులో ఉంటే ఆపై వచ్చేవన్నీ లాభాలే అన్నమాట.