»   »  రామ్ కొత్త చిత్రం 'హైపర్' రిలీజ్ డేట్ ఖరారు

రామ్ కొత్త చిత్రం 'హైపర్' రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌ హీరోగా..సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో 14 రీల్స్‌ సంస్థ ఓ చిత్రం (హైపర్ టైటిల్) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించారు నిర్మాతలు. సెప్టెంబర్ 30న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తీసుకువస్తామని తెలియచేసారు.

నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ - '' ప్రస్తుతం సినిమా వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ జూలై 14 నుంచి హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు నాన్ స్టాఫ్ షెడ్యూల్ ఉంటుంది. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్. దసరా కానుకగా సెప్టెంబర్ 30 న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

Ram's Hyper to release on 30th September

దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ నేను రామ్ చేసిన కందిరీగ వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగిన విధంగా సినిమా హైపర్ గా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నాం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సినిమా అవుట్ పుట్ ఎక్స్ ట్రార్డినరీగా వస్తుంది. రామ్ లోని ఎనర్జీని మరో లెవల్ ఎలివేట్ చేసే చిత్రమవుతుంది అన్నారు.

రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, ఆర్ట్‌: అవినాష్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

English summary
Ram's Hyper to release on 30th September. The movie is currently being shot in Hyderabad. The film Rashi Khanna as female lead and music is by Ghibran.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu