»   »  'నేను శైలజ' సక్సెస్ టూర్ డిటేల్స్

'నేను శైలజ' సక్సెస్ టూర్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం నేను శైలజ. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి మార్నింగ్ షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం యూనిట్ విజయయాత్రలు మొదలెట్టింది. ఆ డిటేల్స్ ని ఇక్కడ మీకు అందిస్తున్నాం.

తొలిసారి తన పంథాకు భిన్నంగా అడుగులు వేస్తూ నటించిన చిత్రమని, సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రమిదని, కమర్షియల్ గీతను దాటి చేస్తున్న ఈ సినిమా తన కెరీర్‌లో ఓ వైవిధ్యమైన ప్రయత్నంగా నిలిచిపోతుందని చెబుతున్నారు రామ్ .


రామ్ మాట్లాడుతూ...ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు హరి. నైట్‌క్లబ్‌లో డీజేగా పనిచేస్తుంటాను. నా పాత్ర పేరు కలిసివచ్చేలా తొలుత హరికథ వర్కింగ్ టైటిల్‌గా అనుకున్నాం. కానీ నా స్నేహితుల మొదలుకొని అమ్మమ్మ వరకు ప్రతి ఒక్కరూ హరికథ టైటిల్ బాగాలేదు అని చెప్పడంతో కొత్తది పెట్టాలనుకున్నాం. సినిమా చూసిన తర్వాత నేను శైలజ యాప్ట్ అనిపించింది. శైలజ అనే అమ్మాయితో సాగే నా ప్రేమకథ కాబట్టి దానినే ఓకే చేశాం అన్నారు.


Ram's Nenu Sailaja Success tour Schedule

దర్శకుడు మాట్లాడుతూ ....నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను తీసుకుని కథగా మలిచాను. సినిమాలోని ప్రతి సన్నివేశం చాలా రియలిస్టిక్‌గా వుంటుంది. ఇదొక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి టీమ్ కుదరడంతో అనుకున్న సమయానికి పూర్తి చేశాం. ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమిది అన్నారు.


నిన్నటి వరకు చాలా రొటీన్ సినిమాలు తీసి తప్పు చేసానని, ఇకపై అలాంటివి రిపీట్ కాకుండా చుసుకుంటానని అన్నారు. అందుకు ఈ నేను శైలజా సినిమాతోనే మార్పుని ఆహ్వానిస్తున్నానని, ఇక సరి కోత్తవి, ట్రెండ్ కు తగ్గట్టుగానే చిత్రాలు చేయాలనుకుంటునట్టు చెప్పారు.


సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్‌కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణచైతన్య, ప్రదీప్‌రావత్, ధన్య బాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, అనంతశ్రీరామ్, సాగర్, డ్యాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్క్ష్రిత్, రఘు, ఫైట్స్: పీటర్ హేయిన్స్, హరి, దినేష్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.

English summary
Ram, Keerthi Suresh's Nenu Sailaja Success tour Schedule, Get ready we are coming to meet you PV Ravi Kishore is produced the film under Sri Sravanthi Movies.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu