»   » 'పండగ చేస్కో' కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

'పండగ చేస్కో' కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రామ్‌ హీరోగా నటించిన చిత్రం 'పండగ చేస్కో'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకోవటంతో ... యావరేజ్ చిత్రంగా కూడా నిలబడలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం...రెండున్నర కోట్లు ఇంకా వస్తేనే కానీ బ్రేక్ ఈవెన్ కూడా రాదు. అయితే ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా చిత్రాల కన్నా మంచి షేర్ వచ్చినట్లే అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


పండుగ చేస్కో...రెండు వారాల కలెక్షన్స్ (షేర్) :


నైజాం : రూ 4.25 కోట్లు


సీడెడ్ : రూ 2.20 కోట్లు


ఉత్తరాంధ్ర: రూ 1.66 కోట్లు


గుంటూరు: రూ 1.10 కోట్లు


కృష్ణా: రూ 0.88 కోట్లు


తూర్పు గోదావరి : రూ 0.96 కోట్లు


పశ్చిమ గోదావరి: రూ 0.85 కోట్లు


నెల్లూరు : రూ 0.45 కోట్లుRam's Pandaga Chesko 2 Weeks Collections

పండుగచేస్కో రెండు వారాలు ఎపి &నైజాం కలెక్షన్స్ : రూ 12.35 కోట్లు


పండుగ చేస్కో రెండు వారాల ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : రూ 13.55 కోట్లు (కర్ణాటక : రూ 0.95 కోట్లు; భారత్ లో మిగతా ప్రాంతాలు: రూ 0.25 కోట్లు; ఓవర్ సీస్ : తెలియరాలేదు)


'''పండగ చేస్కో'ని థియేటర్లో చూశా. కుటుంబ ప్రేక్షకులంతా ఆస్వాదిస్తున్నారు. 92 రోజుల్లోనే సినిమా పూర్తి చేశాం. పైగా రెండు సార్లు సమ్మె సమస్యల్ని ఎదుర్కొన్నాం. అన్ని విధాలా 'పండగ చేస్కో' నాకు పెద్ద పాఠంలా నిలిచిపోతుంది'' అంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని.


డాన్ శ్రీను చిత్రంతో పరిచయమైన గోపిచంద్ ..తర్వాత బాడీగార్డ్ అంటూ ప్లాప్ ఇచ్చారు. తర్వాత మళ్లీ.. వినోదం, యాక్షన్‌, కాసిన్ని భాగోద్వేగాల మేళవింపుతో 'బలుపు' తీశారు. అదీ విజయవంతమైంది. ఇప్పుడు 'పండగ చేస్కో' అంటూ పక్కా వాణిజ్య చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.


Ram's Pandaga Chesko 2 Weeks Collections

అలాగే...రామ్‌ హుషారైన హీరో. ఆయన శైలికి తగిన కథ ఇది. ఇది మాస్‌కి నచ్చే సినిమా మాత్రమే కాదు. కుటుంబ బంధాలున్న సినిమా.బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్‌ నారాయణ పంచిన వినోదం అందరికీ నచ్చింది. చివర్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాపై స్పూఫ్‌లాంటిది చేశాం. ఆ సన్నివేశాలకూ మంచి స్పందన వస్తోంది అని అన్నారు.


ఇక ''స్వతహాగా నాకు ప్రేమకథలంటే ఇష్టం. 'గీతాంజలి' లాంటి సినిమా తీయాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. కాకపోతే ఇక్కడున్న పరిస్థితులు వేరు. నిర్మాత, పంపిణీదారులు, ప్రదర్శనకారులు అందరూ లాభపడాలి. అలాంటి సినిమాలే తీయాలి. ఈ విషయంలో నాకు వినాయక్‌గారే అదర్శం. ఇప్పటి వరకు ఆయన సినిమాని కొన్న ఏ ఒక్కరూ నష్టపోలేదు.


అంతేకాదు 'మీ సినిమా అనే ధీమాతోనే పండగ చేస్కో కొన్నామండీ' అని పంపిణీదారులు అంటుంటే వాళ్ల కోసం సేఫ్‌ గేమ్‌ ఆడడంలో తప్పు లేదనిపించింది. ఇక్కడ ప్రేక్షకులు కోరుకొన్న సినిమాలే ఇవ్వాలి. కొత్తదనం పేరుతో మన భావాల్ని వాళ్లపై బలవంతంగా రుద్దకూడదు'' అని చెప్పుకొచ్చారు.


కథ రొటీన్ గా ఉందనే విషయమై మాట్లాడుతూ...''కొత్త కథలు తక్కువగా వస్తున్నాయి. ఉన్న కథలనే స్క్రీన్‌ప్లేతో తెలివిగా మలచుకోవాల్సిందే. ఎలాంటి కథ చెప్పినా వినోదం మేళవిస్తూ చెబితే తప్పకుండా ప్రేక్షకులు మెచ్చుకొంటారు. మున్ముందూ వినోదాన్ని నమ్ముకొనే ప్రయాణం సాగిస్తా. ప్రస్తుతం కొత్త స్క్రిప్టులు సిద్ధం చేసుకొంటున్నా. నా తదుపరి చిత్రం ఓ అగ్ర కథానాయకుడితో ఉంటుంది. వివరాలు త్వరలో చెబుతా'' అని అన్నారు.


రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
Pandaga Chesko 2 Weeks AP & Nizam Collections: Rs 12.35 Crore. Pandaga Chesko 2 Weeks Worldwide Collections: Rs 13.55 Crore (includes Karnataka: Rs 0.95 crore; Rest Of India: Rs 0.25 crore; Overseas: N.A
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu