»   » కాన్ఫిడెంట్ గా రిలీజ్ ..ఇప్పుడేమో ట్రిమ్ చేస్తున్నారు

కాన్ఫిడెంట్ గా రిలీజ్ ..ఇప్పుడేమో ట్రిమ్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌ హీరోగా నటించిన చిత్రం 'శివమ్‌' మొన్న శుక్రవారం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. ఈ చిత్రం చాలా కాన్ఫిడెంట్ గా నిర్మాతలు రిలీజ్ చేసారు. అయితే సినిమా చూసే జనాలకు చాలా తలనొప్పిగా అనిపిస్తూండటంతో ట్రిమ్ చేసి వదలుతున్నారు. సోమవారం నుంచి ఈ ట్రిమ్ చేసిన వెర్షన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. కలెక్షన్స్ పై ఈ ట్రిమ్ చేసిన వెర్షన్ ఫలితం కనపడుతుందేమో చూడాలి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం కథేమిటంటే...


'మనకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకూ వెయిట్ చెయ్యాలి, దొరికాక ఆ అమ్మాయి కోసం ఫైట్ చెయ్యాలి' అనే ఫిలాసపీతో బ్రతుకుతూ ప్రేమికులకు పెళ్లిళ్లు, సాయాలు, అందుకోసం రిస్క్ లు చేస్తూంటాడు శివమ్(రామ్). ఆ ప్రాసెస్ లో అతను ఇగో ఎక్కువ ఉన్న రౌడీ జడ్చర్ల బోజి రెడ్డి (వినయ్ కుమార్) అనే రౌడీని కెలుకుతాడు. మరో ప్రక్క అతను తను(రాశిఖన్నా) కనపడటంతో ఆమెతో ప్రేమలో పడి,వెంటబడతాడు.


Ram’s Shivam movie trimmed

తను..కరెక్టు గా శివ కు ప్రేమ ని ఎక్సప్రెస్ చేసే సమయానికి అభి(అభిమన్యు సింగ్) అనే గూండా ఆమెను ఎత్తుకుపోతాడు. అభి కూడా ఆమెను ప్రేమిస్తాడు అందుకే కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయాడన్నమాట. ఇప్పుడు శివ...తనను వెంబడిస్తున్న బోజి రెడ్డి మనుష్యుల నుంచి తప్పించుకుని అభి వద్ద నుంచి ఎలా తీసుకుతెచ్చుకున్నాడు. తన ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది మిగతా కథ.


చిత్రం రిలీజ్ కు ముందు ...


నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ''హుషారైన ఓ కుర్రాడి ప్రేమకథ ఇది. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌ మేళవింపుతో తెరకెక్కుతోంది. రామ్‌ తన శైలికి తగ్గ పాత్రని పోషిస్తున్నాడు''అన్నారు.


Ram’s Shivam movie trimmed

అలాగే - "కథాబలం ఉన్న చిత్రం ఇది. స్క్రీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి'' అని చెప్పారు.


బ్యానర్ శ్రీ స్రవంతి మూవీస్
నటీనటులు:రామ్, రాశిఖన్నా, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌,
ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
సమర్పణ: కృష్ణచైతన్య
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్
విడుదల తేదీ:02, అక్టోబర్ 2015.

English summary
Shivam has been trimmed by nearly 20 minutes and the makers edited out all the unnecessary scenes that were causing a huge hindrance to the film's smooth narrative flow.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu