»   » సమస్య తీరింది: రామోజీ రావు చలించి ఆర్. నారాయణమూర్తి కి సాయం

సమస్య తీరింది: రామోజీ రావు చలించి ఆర్. నారాయణమూర్తి కి సాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :కనీసం పట్టణానికి ఒక థియేటర్ అయినా తన చిత్రానికి ఇవ్వండంటూ నారాయణమూర్తి కొద్ది రోజుల క్రితం బహిరంగంగా వేడుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదు కానీ..ఊహించని విధంగా ..ఆర్ నారాయణ మూర్తిగా ఓ పెద్ద అండ లభించేసింది. మీడియా మొఘల్ రామోజీరావు... మూర్తిగా అండగా నిలిచారు.

ప్రస్తుతం అనారోగ్యం కారణంగా బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉన్న రామోజీ... ఆర్. నారాయణ మూర్తి పడుతున్న ఇబ్బంది చూసి చలించిపోయారని తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన ఆయన తన స్టాఫ్ ని పిలిచి నారాయణ మూర్తి ఇబ్బందులు తీర్చేయండని ఆదేశాలు జారీ చేశారని ట్రేడ్ వర్గాల సమచారం. అంతే క్షణాల్లో మూర్తి చిత్రానికి 100కు పైగా థియేటర్లు దొరికిపోయాయి. రామోజీ ఆధ్వర్యంలో మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ధియోటర్స్ ని ఎరేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాదులోని సంధ్య 35ఎంఎం థియేటర్లోనూ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజ్ కానుందట.

Ramoji Rao Blessings For R Narayana Murthy


''తొలిసారి నా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ నెల 14న రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. ఈ సంక్రాంతికి నా సినిమా రిలీజ్ అవుతోంది అంటే.. మెగాస్టార్ - యువరత్న మధ్యలో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్లతో నాకు పోటీ లేదు. ఐతే నా సినిమాకి ఒక్క థియేటర్ కూడా దొరకని పరిస్థితి. మరీ ఒక్క థియేటర్ కూడా లేదు అంటుంటే ఏడుపొస్తోంది. కొంత మంది చేతుల్లో థియేటర్లుండటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. సినిమా రిలీజవుతుంది కదా థియేటర్లు ఎన్ని దొరికాయి అని నిర్మాతని అడిగినప్పుడు ఆయన ఒక్క థియేటర్ కూడా దొరకలేదని చెప్పగానే ఏడుపొచ్చింది అంటూ ఆర్. నారాయణ మార్తి ఆవేదనగా అన్నారు.


ఈ సంక్రాంతికి 'ఖైదీ నెం 150, గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి, జయసుధలు జంటగా నటించిన 'హెడ్ కానిస్టేబుల్ వెంట్రామయ్య' కూడా జనవరి 14న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క థియేటర్ కూడా దొరకలేదు. దీని పట్ల ఆగ్రహంగా స్పందించిన నారాయణ మూర్తి పరిశ్రమను, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చిన్న సినిమాకి ధియేటర్లు దొరకకపోవడం అంటే దుర్మార్గం. చిన్న సినిమాలకు థియేటర్లు లభించేలా చూడాల్సిన బాధ్యత ఫిలిం ఛాంబర్.. ప్రొడ్యూసర్ కౌన్సిల్.. అలాగే ప్రభుత్వం మీదా ఉంది. క్రేజ్ క్యాష్ చేసుకోవడం కోసం ఒకే సినిమాని అన్ని థియేటర్లలో వేస్తున్నారు. చిన్న సినిమాల్ని పండగ లేనప్పుడు.. పెద్ద సినిమాలు లేనప్పుడు చూసుకుని రిలీజ్ చేయాలా? సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జనం నిర్ణయిస్తారు. ఇండస్ట్రీ ఏ ఒక్కరిదో కాదు.. అందరిదీ. చిన్న సినిమాలకు న్యాయం చేయమని కోరుతున్నాను. మాకు వెయ్యో 2 వేలో థియేటర్లు అక్కర్లేదు. ఊరికి ఒక్క థియేటర్ ఇవ్వండి చాలు'' అని నారాయణమూర్తి కోరారు.

English summary
Ramoji Rao has stepped in and see to it that theatres would be arranged for Narayanamurthy's film 'Head Constable Venkatramaiah' through Mayuri Film Distributors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu