»   » ‘రంగస్థలం’ 10 డేస్ కలెక్షన్స్: పాతుకు పోయిన రికార్డులను దున్నేస్తోంది!

‘రంగస్థలం’ 10 డేస్ కలెక్షన్స్: పాతుకు పోయిన రికార్డులను దున్నేస్తోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకుని సంచలన కలెక్షన్ నమోదు చేసింది. శ్రీమంతుడు చిత్రాన్ని వెనక్కి నెట్టి తెలుగు సినిమా చరిత్రలో టాప్ 5 ఆల్ టైమ్ గ్రాసర్స్‌లో చోటు దక్కించుకుంది. ఏళ్ల తరబడి పాతుకుపోయిన రికార్డులను దున్నేస్తూ ముందుకు సాగుతోంది.

Rangasthalam First Week Collections
 ఎదురులేని రంగస్థలం

ఎదురులేని రంగస్థలం

తొలివారంలోనే ప్రపంచ వ్యాప్తంగా 128 కోట్ల గ్రాస్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లిన ఈ మూవీ రెండో వారాంతం కూడా మంచి వసూళ్లు సాధించింది. మధ్యలో విడుదలైన ఛల్ మోహన్ రంగ, ఇంతలో ఎన్నెన్ని వింతలో, గులేబకావలి, సత్యాగ్యాంగ్ లాంటివి ‘రంగస్థలం' చిత్రానికి పెద్దగా పోటీ ఇవ్వక పోవడంతో వసూళ్ల జోరు కొనసాగింది.

150 కోట్ల చేరువలో...

150 కోట్ల చేరువలో...

రెండో వారాంతమైన శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం దాదాపు రూ. 19.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో 10 రోజుల టోటల్ కలెక్షన్ రూ. 147.10(గ్రాస్) కోట్లకు చేరుకుంది. దీంతో శ్రీమంతుడు రికార్డ్ (144.55 కోట్లు)ను అధిగమించినట్లయింది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ 150 కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆ మెగా రికార్డులను సైతం వెనక్కి నెట్టడం ఖాయం

ఆ మెగా రికార్డులను సైతం వెనక్కి నెట్టడం ఖాయం

బాహుబలి, బాహుబలి 2 రికార్డులను పక్కన పెడితే..... రంగస్థలం కంటే ముందు మగధీర(రూ. 150 కోట్లు), ఖైదీ నెం. 150(రూ. 164 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. లైఫ్ టైమ్ రన్‌లో రంగస్థలం ఈ రెండు చిత్రాలను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.

త్వరలో 100 కోట్ల షేర్

త్వరలో 100 కోట్ల షేర్

ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మగా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 92 కోట్లకుపైగా వచ్చింది. లైఫ్ టైమ్ రన్‌లో రూ. 100 కోట్ల షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యూఎస్ఏలో కలెక్షన్ల ప్రభంజనం

యూఎస్ఏలో కలెక్షన్ల ప్రభంజనం

మరో వైపు రంగస్థలం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 3 మిలియన్ గ్రాస్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డుల కేటగిరీలో మొదటి స్థానంలో ఉంది. రామ్ చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా ‘రంగస్థలం' చరిత్ర సృష్టించింది.

English summary
Rangasthalam collected approximately Rs 19.10 crore gross at the worldwide box office in its second weekend, taking its 10-day total collection to Rs 147.10 crore gross. The movie has inched to closer to the mark of Rs 150 crore gross mark in the global market.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X