twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రంగస్థలం: బాక్సాఫీస్ షేకవుతోంది, 2 రోజుల్లో 50 శాతం రికవరీ... టోటల్ ఎతంటే?

    By Bojja Kumar
    |

    రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' మూవీ బాక్సాఫీసు వద్ద ప్రకంపణలు సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన 2వ రోజే రూ. 60 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాపై విడుదల ముందు నుండే భారీ హైప్ రావడం, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500లకు పైగా స్క్రీన్లలో విడుదల కావడం, సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది.

    బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

    బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

    రంగస్థలం మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.80 కోట్ల గ్రాస్ సాధించినట్లు అంచనా. ఇందులో రూ. 28.30 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. రంగస్థలం మూవీ రామ్ చరణ్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచి వారి గత చిత్రాల రికార్డులను బీట్ చేసింది.

    తెలుగులో 6వ స్థానం, సౌతిండియాలో 8వ స్థానం

    తెలుగులో 6వ స్థానం, సౌతిండియాలో 8వ స్థానం

    ఇక తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 6వ చిత్రంగా, సౌతిండియా వ్యాప్తంగా తీసుకుంటే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 8వ చిత్రంగా ‘రంగస్థలం' నిలిచిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

     మౌత్ టాక్ సూపర్

    మౌత్ టాక్ సూపర్

    సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుండి పాజిటివ్ టాక్ రావడం సినిమాకు బాగా కలిసొస్తోంది. మౌత్ టాక్ బావుండటంతో కలెక్షన్లు జోరుమీదున్నాయి. అయితే తొలి రోజుతో పోల్చకుంటే శనివారం వసూళ్లు దాదాపు 50 శాతం తగ్గాయి. తొలి రోజు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండటం, టికెట్ రేటు ఎక్కువగా ఉండటం... రెండో రోజు అవి లేక పోవడంతో వసూళ్ల ఫిగర్ చిన్నగా కనిపిస్తోంది.

    శనివారం రిపోర్ట్

    శనివారం రిపోర్ట్

    రంగస్థలం మూవీ శనివారం బాక్సాఫీసు వద్ద రూ. 21 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల కలెక్షన్ కలిపి రూ. 63.80 కోట్లకు రీచ్ అయింది. ఇక శనివారం డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 13.50 కోట్లు వచ్చినట్లు సమాచారం.

    రెండు రోజుల్లో 50శాతం రికవరీ

    రెండు రోజుల్లో 50శాతం రికవరీ

    రెండు రోజుల్లో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ. 41.86 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం డిస్ట్రిబ్యూసన్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మారు. అయితే రెండు రోజుల్లోనే 50 శాతంమేర తిరిగి రావడం విశేషం.

     ఏరియా వైజ్ రిపోర్ట్

    ఏరియా వైజ్ రిపోర్ట్

    తొలి రెండు రోజుల్లో ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో రూ. 7.48 కోట్లు, సీడెడ్ రూ. 5.50 కోట్లు, వైజాగ్ రూ. 3.76 కోట్లు, ఈస్ట్ రూ. 2.71 కోట్లు, వెస్ట్ రూ. 2.11 కోట్లు, కృష్ణ రూ. 2.23 కోట్లు, గుంటూరు రూ. 3.79 కోట్లు, నెల్లూరు రూ. 1.05 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది.

    English summary
    Rangasthalam is estimated to have collected approximately Rs 21 crore gross at the worldwide box office on Saturday. Its two-day total collection has reached Rs 63.80 crore gross in the global market. The movie is estimated to have earned approximately Rs 13.56 crore for its distributors on Saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X