twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ లాభాలు తెచ్చిన ‘రంగస్థలం’: 50 డేస్ కలెక్షన్ ఏరియావైజ్

    By Bojja Kumar
    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నమోదు చేసిన చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రూ. 125.99 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. సినిమాను కొన్న ప్రతి బయ్యర్ ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఏరియా వైజ్ ఈ చిత్రం ఎక్కడ ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం...

    Recommended Video

    Ram Charan Talks About Rangasthalam Shooting Experiences
    నైజాం ఏరియా

    నైజాం ఏరియా

    నైజాం ఏరియా రైట్స్ రూ. 18 కోట్లకు అమ్ముడవ్వగా ఈచిత్రం ఇక్కడ రూ.28.50 కోట్లు వసూలు చేసింది. రామ్ చరణ్ కెరీర్లో నైజాం ఏరియాలో హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రం ఇది.

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియాలో

    సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 12 కోట్లకు అమ్ముడవ్వగా ఇక్కడ ఈ చిత్రం రూ. 18.20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. 50 రోజుల్లో ఈ చిత్రం ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేసింది.

     ఉత్తరాంధ్ర

    ఉత్తరాంధ్ర

    ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 8 కోట్లకు అమ్మగా ఈ చిత్రం 50 రోజుల్లో రూ. 13. 42 కోట్ల షేర్ వసూలు చేసింది.

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి ఏరియాలో ‘రంగస్థలం' రైట్స్ రూ. 4.2 కోట్లకు అమ్ముడవ్వగా రూ. 6.40 కోట్లు వసూలు చేసింది.

    తూర్పు గోదావరి

    తూర్పు గోదావరి

    తూర్పు గోదావరి ఏరియాలో రూ. 5.4 కోట్లు రైట్స్ అమ్ముడవ్వగా ఇప్పటి వరకు రూ. 8:00 కోట్ల షేర్ రాబట్టింది.

    గుంటూరు

    గుంటూరు

    గుంటూరు ఏరియాకు రూ. 6.6 కోట్లకు రైట్స్ అమ్ముడవ్వగా ఇప్పటి వరకు రూ. 8.60 కోట్లు వసూలు చేసింది.

    కృష్ణ ఏరియా

    కృష్ణ ఏరియా

    కృష్ణ ఏరియాకు రూ. 4.8 కోట్లకు రైట్స్ అమ్మగా ఈ చిత్రం ఇక్కడ రూ. 7 కోట్లు రాబట్టింది.

    నెల్లూరు ఏరియా

    నెల్లూరు ఏరియా

    నెల్లూరు ఏరియా రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడవ్వగా.... ఇక్కడ ఈ చిత్రం రూ. రూ. 3.49 కోట్లు షేర్ వసూలు చేసింది.

    ఏపీ తెలంగాణ రైట్స్

    ఏపీ తెలంగాణ రైట్స్

    ఏపీ, తెలంగాణ ప్రాంతంలో అన్ని ఏరియాల్లో కలిపి రూ. 62 కోట్లకు రైట్స్ అమ్ముడవ్వగా ఇప్పటి వరకు మొత్తం రూ :రూ. 93.37 కోట్ల షేర్ వసూలు చేసింది.

    వరల్డ్ వైడ్

    వరల్డ్ వైడ్

    కర్నాటకలో రూ. 7.6 కోట్లకు రైట్స్ అమ్ముడవ్వగా రూ. 9.40 కోట్లు షేర్ రాబట్టింది. రెస్టాప్ ఇండియాలో రూ. 1.4 కోట్లకు రైట్స్ అమ్ముడవ్వగా రూ. 2.70 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 9 కోట్లకు అమ్ముడవ్వగా రూ. 18 కోట్లు వసూలు చేయడం ద్వారా రెట్టింపు లాభాలు తెచ్చింది. రూ. 2.5 కోట్ల ఓవర్ ఫ్లో వచ్చింది. వరల్డ్ వైడ్ ‘రంగస్థలం' రూ. 80 కోట్లకు అమ్ముడవ్వగా రూ. 125.99 కోట్లు వసూలు చేసింది.

    English summary
    Rangasthalam is running successfully at the box office and on 18th May, Rangasthalam has successfully completed the successful run of 50 days. According to the traders report, Rangasthalam has earned Rs 125.99 Cr shares at Worldwide box office after the successful run of 50 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X