»   » 9వ రోజు రంగస్థలం: నాన్ బాహుబలి రికార్డులన్నీ ఢాం! (టాప్ 10 లిస్ట్)

9వ రోజు రంగస్థలం: నాన్ బాహుబలి రికార్డులన్నీ ఢాం! (టాప్ 10 లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. తాజాగా బాక్సాఫీసు వద్ద 9 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ గ్రాస్ వసూలు చేయడం ద్వారా ఇప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నీంటిని బద్దలు కొట్టింది. నిన్న మొన్నటి వరకు నాన్ బాహుబలి సినిమాల కేటగిరీలో శ్రీమంతుడు టాప్ లో ఉండగా.... ఈ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ మార్కును 'రంగస్థలం' కేవలం 9 రోజుల్లోనే అధిగమించింది.

తొలివారం పరిస్థితి ఇలా

తొలివారం పరిస్థితి ఇలా

మార్చి 30న విడుదలైన ‘రంగస్థలం' ఫస్ట్ వీకెండ్ యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద అదరగొట్టింది. వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధించింది. అయితే మధ్యలో నితిన్ ఛల్ మోహన్ రంగ విడదుల కావడతో స్క్రీన్ కౌంట్ తగ్గడంతో కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి. అలా తొలి వారం పూర్తయ్యే నాటికి బాక్సాఫీసు వద్ద $2,747,004 వసూళ్లు నమోదు చేసింది.


ఎదురు లేని రంగస్థలం

ఎదురు లేని రంగస్థలం

యూఎస్ఏలో ఏప్రిల్ 4వ తేదీన ‘ఛల్ మోహన్ రంగ' విడుదలైనప్పటికీ ఈ చిత్రం మిక్డ్స్ టాక్ రావడంతో ‘రంగస్థలం' చిత్రానికి ఎదురు లేకుండా పోయింది. రెండో శుక్రవారం చాలా మంది ‘రంగస్థలం' వైపే మొగ్గు చూపారు. శుక్రవారం $122,280 వసూలు చేసింది. దీంతో టోటల్ 8 రోజుల కలెక్షన్ $2,869,284 మార్కును అందుకుంది.


 9వ రోజుకు 3 మిలియన్

9వ రోజుకు 3 మిలియన్

9వ రోజైన శనివారం మంచి రెస్పాన్స్ రావడంతో ‘రంగస్థలం' చిత్రం 3 మిలియన్ మార్కును అందుకుంది. బాహుబలి తర్వాత 3 మిలియన్ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా రికార్డుల కెక్కింది. బాహుబలి, బాహుబలి 2 తర్వాత యూఎస్ఏలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


టాప్ 10 టాలీవుడ్ యూఎస్ఏ బాక్సాఫీస్ గ్రాసర్స్

టాప్ 10 టాలీవుడ్ యూఎస్ఏ బాక్సాఫీస్ గ్రాసర్స్

1. బాహుబలి ది కంక్లూజన్ : $21 మిలియన్
2. బాహుబలి ది బిగినింగ్ : $8.46 మిలియన్
3. రంగస్థం: $3 మిలియన్
4. శ్రీమంతుడు : $2.89 మిలియన్
5. అ..ఆ: $2.44 మిలియన్
6. ఖైదీ నెం.150 : $2.44 మిలియన్
7. ఫిదా : $2.067 మిలియన్
8. అజ్ఞాతవాసి: $2.065 మిలియన్
9. నాన్నకు ప్రేమతో: $2.02 మిలియన్
10. అత్తారింటికి దారేది: $1.89 మిలియన్


English summary
Rangasthalam 9 days USA box office report details. Rangasthalam has crossed the collection mark of $3 million at US box office in nine days and become the third-highest-grossing Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X