»   » బాక్సాఫీస్ రిపోర్ట్: ‘పద్మావత్’ తర్వాత అక్కడ ‘రంగస్థలం’ టాప్

బాక్సాఫీస్ రిపోర్ట్: ‘పద్మావత్’ తర్వాత అక్కడ ‘రంగస్థలం’ టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో వసూళ్లు అదరగొడుతోంది. యూఎస్ఏ మార్కెట్లో ఫస్ట్ వీకెండ్‌లోపే 2 మిలియన్ డాలర్ మార్క్ అందుకున్న ఈ చిత్రం, ఆస్ట్రేలియాలో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఓపెనింగ్ వీకెండ్ టాప్ కలెక్షన్ సాధించిన భారతీయ చిత్రాల్లో 'రంగస్థలం' 2వ స్థానంలో నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.2018లో విడుదలైన చిత్రాల్లో 'పద్మావత్' తర్వాత 'రంగస్థలం' బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇక్కడ ఫస్ట్ వీకెండ్ $ 289,768 (రూ 1.45 కోట్లు) వసూలు చేసింది. రంగస్థలం వసూళ్ల అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయని తెలిపారు.ఓపెనింగ్ వీకెండ్ ఆస్ట్రేలియా టాప్ 5-2018


1. 'పద్మవత్‌' (తెలుగు, హిందీ, తమిళ భాషలతో కలిసి) $1,728,642
2. 'రంగస్థలం' $289,768
3. 'బాఘి2' $2' 249,483
4. 'సజ్జన్‌ సింగ్‌ రంగ్రోట్‌‌' (పంజాబి)$ 236,881
5, 'లవంగ్‌ లాచి' (పంజాబి) $182,273


English summary
"This is HUGE... This is an EYE-OPENER... Telugu film #Rangasthalam is the SECOND BIGGEST *opening weekend grosser* [2018] in AUSTRALIA... Collects A$ 289,768 [₹ 1.45 cr] in its opening weekend... Top 5 list follows" Taran Adarsh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X