»   » చిట్టి బాబు దెబ్బకు బాక్స్ ఆఫీస్‌కు బీటలు.. రంగస్థలం తొలిరోజు వసూళ్లు ఎంతంటే!

చిట్టి బాబు దెబ్బకు బాక్స్ ఆఫీస్‌కు బీటలు.. రంగస్థలం తొలిరోజు వసూళ్లు ఎంతంటే!

Subscribe to Filmibeat Telugu

రాంచరణ్ రంగస్థలం చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజు బాక్స్ ఆఫీస్ దద్దరిల్లేలా రంగస్థలం వసూళ్లు ఉన్నాయి. సుకుమార్, రాంచరణ్ కలసి రంగస్థలం చిత్రంతో అద్భుతమే చేశారని చెప్పొచ్చు. విలేజ్ నేపథ్యంలో 80 లలోని లోకల్ రాజకీయాలకు అనుగుణంగా ఈ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సుకుమార్ చేసిన ఈ ప్రయోగం 100 శాతం ఫలితాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. రంగస్థలం చిత్రంతో రాంచరణ్ నటుడిగా చాలా సాధించాడు. మెగాస్టార్ వారసుడిగా నటనలో ఏమాత్రం తగ్గనని నిరూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా రంగస్థలం చిత్ర వసూళ్లు కళ్ళు చెదిరే విధంగా ఉన్నాయి.


సుకుమార్ శ్రమకు దక్కిన ఫలితం

సుకుమార్ శ్రమకు దక్కిన ఫలితం

సుకుమార్ దాదాపు ఏడాది సమయం కస్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రంగస్థలం అనే ప్రపంచాన్ని ఊహించుకుని తన కథతో ప్రాణం పోశారు. సుకుమార్ ప్రాణం పోసిన ఆ రంగస్థలమే ఇప్పుడు వెండి తెరపై అద్భుతాలు చేస్తోంది.


చిట్టిబాబు రీసౌండ్

చిట్టిబాబు రీసౌండ్

మగధీర చిత్రంలో రాంచరణ్ పెర్ఫామెన్స్ ని ఎవరూ మరచిపోలేరు. ఆ తరువాత కూడా చరణ్ కు విజయాలు దక్కాయి. కానీ మగధీర తరువాత అంతటి విజయం రంగస్థలం చిత్రమే అని చెప్పొచ్చు. రాంచరణ్ నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అబ్బురపరిచే విధంగా ఉంది.


 తొలి రోజు రికార్డ్ కలెక్షన్స్

తొలి రోజు రికార్డ్ కలెక్షన్స్

అద్భుతమైన పాజిటివ్ టాక్ తో రంగస్థలం చిత్రం దూసుకుపోతోంది. రంగస్థలం చిత్ర మానియా తొలిరోజు వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. బాక్స్ ఆఫీస్ దద్దరిల్లేలా రంగస్థలం చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అందులో ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల వరకు షేర్ ఉన్నట్లు తెలుస్తోంది.


లాభాల పంట

లాభాల పంట

రంగస్థలం చిత్రం 80 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ లెక్కన చూస్తే ఇప్పుడున్న ఊపులో మరి కొద్ది రోజుల్లోనే రంగస్థలం చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాల పంట పండించడం ఖాయం.


English summary
Rangasthalam first day collections. Best openings for Ram Charan any movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X