Don't Miss!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం సరైన ఫ్రెండ్‌ను కనిపెట్టడం ఎలాగంటే..
- Finance
Adani Shares: అదానీపై రిపోర్టు విశ్వసనీయమైనదే.. నోరు విప్పిన బిలియనీర్ ఇన్వెస్టర్
- Sports
INDvsNZ : అది అంత ఈజీ కాదు.. అతన్ని తొలి టీ20 ఆడించాలన్న మాజీ లెజెండ్!
- Automobiles
బుల్లితెర నటి 'శ్రీవాణి' కొన్న కొత్త కారు, ఇదే: చూసారా..?
- News
Powerful SI: ఎస్ఐ పేరుతో నకిలి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్, 50 మంది మహిళలను?, 1 లక్ష మంది ఫాలోవర్స్!
- Technology
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Dhamaka 10 Days Collections: ఆదివారం సంచలన వసూళ్లు.. ధమాకా నాన్ SSR రికార్డు.. ఫస్ట్ డేతో సమానంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్పీడుగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. గత ఏడాది అతడు ముందుగా 'ఖిలాడి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా సరిగా ఆడలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రవితేజ 'ధమాకా' సినిమా చేశాడు. ఇది మాత్రం ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్లతో రచ్చ లేపుతోంది. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ 10 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

ధమాకా అంటూ వచ్చిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు. భీమ్స్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.
Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్
రవితేజకు ఉన్న మార్కెట్, సినిమాపై అంచనాల వల్ల 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ఓవరాల్‌గా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ అయినట్లు తెలిసింది.

10వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'ధమాకా'కు 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సంచలన వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 95 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 53 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో మొత్తంగా రూ. 4.20 కోట్లు షేర్, రూ. 7.65 కోట్లు గ్రాస్ వసూలైంది.
హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

10 రోజుల్లో ఎంత వసూలైంది?
10 రోజుల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 13.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.46 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.47 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.07 కోట్లు, గుంటూరులో రూ. 1.53 కోట్లు, కృష్ణాలో రూ. 1.45 కోట్లు, నెల్లూరులో రూ. 79 లక్షలతో మొత్తంగా రూ. 29.27 కోట్లు షేర్, రూ. 53.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
రవితేజ - శ్రీలీల జంటగా చేసిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 10 రోజుల్లో రూ. 29.27 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.25 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 89 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
మళ్లీ తెగించిన అషు రెడ్డి: అమాంతం షర్ట్ విప్పేసి ఎద అందాల ఆరబోత

ధమాకా మూవీకి లాభాలు ఇలా
పక్కా కమర్షియల్ కథతో రూపొందిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 110.00 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 210.47 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.47 కోట్లు లాభాలు దక్కాయి.

ధమాకా నాన్ రాజమౌళి రికార్డు
రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందిన 'ధమాకా' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ముఖ్యంగా 10వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజుతో సమానంగా రూ. 4.20 కోట్లు వసూలు చేసింది. తద్వారా నాన్ రాజమౌళి (రాజమౌళి తీయని సినిమాలు) సినిమాల్లోనే టాప్ ప్లేస్‌కు చేరుకుని సంచలన రికార్డు సాధించింది.