Don't Miss!
- Finance
ధనిక దేశంలో ఇంధన సంక్షోభం.. గ్యాస్ బిల్లులు చెల్లించేందుకూ అవస్థలు
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka 12 Days Collections: 100 కోట్లతో రవితేజ ధమాకా.. బన్నీ, మహేశ్, బాలయ్య రికార్డులు బ్రేక్
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది మాస్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. హిట్లు ఫ్లాపులను ఏమాత్రం పట్టించుకోని ఈ స్టార్ హీరో.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే గత డిసెంబర్‌లో రవితేజ 'ధమాకా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో తాజాగా ఈ చిత్రం సంచలన రికార్డులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ 12 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

ధమాకాతో రవితేజ అరాచకం
మాస్ మహారాజా రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబోలో తెరకెక్కించిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్
రవితేజకు మార్కెట్, సినిమాపై అంచనాల ప్రకారమే 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగింది.

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
12వ రోజు 'ధమాకా'కు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో మొత్తంగా రూ. 1.02 కోట్లు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వసూలైంది.
జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో

12 రోజుల్లో ఎంత వసూలైంది?
'ధమాకా' మూవీ 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 15.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.05 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.94 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.58 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.14 కోట్లు, గుంటూరులో రూ. 1.62 కోట్లు, కృష్ణాలో రూ. 1.55 కోట్లు, నెల్లూరులో రూ. 84 లక్షలతో మొత్తంగా రూ. 31.92 కోట్లు షేర్, రూ. 58.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
రవితేజ - శ్రీలీల జోడీగా చేసిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 12 రోజుల్లో రూ. 31.92 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.06 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.35 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 12 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.33 కోట్లు షేర్‌తో పాటు రూ. 96 కోట్లకుపైగా గ్రాస్ వసూలు అయింది.
స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

ధమాకా మూవీకి లాభాలు ఇలా
ఫుల్ లెంగ్త్ మాస్ స్టోరీతో రూపొందిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 37.33 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 18.33 కోట్లు లాభాలు దక్కాయి.

రవితేజ సంచలన రికార్డు
రవితేజ నటించిన 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 12 రోజులు కోటి అంతకంటే ఎక్కువ షేర్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఘనతను అందుకున్న ఏడో చిత్రంగా నిలిచింది. అలాగే, అఖండ, పుష్ప, సర్కారు వారి పాట (ఈ చిత్రాలు 11 రోజులు) రికార్డులను బ్రేక్ చేసింది. అలాగే, కేజీఎఫ్ చాప్టర్ 2తో సమానంగా నిలిచింది. ఈ లిస్టులో బాహుబలి 2 టాప్‌లో ఉంది.