Don't Miss!
- Sports
SAT20 : విల్ జాక్స్ ఊచకోత.. చిత్తుగా ఓడిన ఎంఐ!
- News
Jaggareddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Dhamaka 13 Days Collections: ధమాకాకు ఊహించని వసూళ్లు.. కేజీఎఫ్ రికార్డు సమం.. మరో 2 కోట్లు వస్తే!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. గత ఏడాది వరుసగా 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి రెండు భారీ ఫ్లాపులను చవి చూసిన అతడు.. ఆ తర్వాత 'ధమాకా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 13వ రోజు మాత్రం వసూళ్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

ధమాకాతో రవితేజ అరాచకం
టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించారు.
Lakshmi Manchu హాట్ సెల్ఫీ వైరల్.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ట్రీట్!

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్
సినిమాపై అంచనాలు, రవితేజ మార్కెట్ ప్రకారమే 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ అయింది.

13వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'ధమాకా'కు తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు వసూళ్లు డౌన్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో మొత్తంగా రెండు రాష్ట్రాల్లో రూ. 74 లక్షలు షేర్, రూ. 1.36 కోట్లు గ్రాస్ వసూలైంది.
ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

13 రోజుల్లో ఎంత వసూలైంది?
13 రోజుల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 15.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.22 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 4.02 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.16 కోట్లు, గుంటూరులో రూ. 1.64 కోట్లు, కృష్ణాలో రూ. 1.58 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలతో మొత్తంగా రూ. 32.66 కోట్లు షేర్, రూ. 59.61 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
రవితేజ - శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 13 రోజుల్లో రూ. 32.66 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.13 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.39 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 13 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.18 కోట్లు షేర్‌తో పాటు రూ. 98 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

ధమాకా మూవీకి లాభాలు ఇలా
పక్కా మాస్ మసాలా స్టోరీతో రూపొందిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 38.18 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19.18 కోట్లు లాభాలు దక్కాయి.

కేజీఎఫ్ రికార్డు సమం చేశాడు
రవితేజ నటించిన 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 12 రోజులు కోటి అంతకంటే ఎక్కువ షేర్‌ను వసూలు చేసింది. తద్వారా 2022లో వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ రికార్డును సమం చేసింది. ఇక, ఈ చిత్రానికి మరో రెండు కోట్ల రూపాయలు వసూలు అయితే వంద కోట్లు గ్రాస్ మార్కును చేరుతుంది. అదే జరిగితే రవితేజ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరుతుంది.