Don't Miss!
- Finance
Income Tax: ఆదాయపన్ను పరిమితి పెంచిన నిర్మలమ్మ.. రూ.7 లక్షల వరకు NO టాక్స్..
- News
Budget : మూలధన వ్యయం భారీగా పెంచిన నిర్మలమ్మ- 33 శాతం- 10 లక్షల కోట్లకు చేరిక
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Lifestyle
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమంపీరియడ్స్ గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- Technology
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Dhamaka 15 Days Collections: రవితేజ మరో రికార్డు.. 15 రోజుల్లో అన్ని కోట్లు.. ఇంకో 40 లక్షలు వస్తే!
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన శైలి చిత్రాలను చేస్తూ.. బడా హీరోగా వెలుగొందుతూ దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను అలరించే చిత్రాలతో మాస్ హీరోగా చెరగని ముద్రను వేసుకున్న అతడు.. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా మూవీలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'ధమాకా' అనే కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మూడో వారంలోనూ కలెక్షన్లు పోటెత్తుతన్నాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ 15 రోజుల్లో ఎంత వసూలు చూద్దాం పదండి!

ధమాకా చూపాలని వచ్చిన హీరో
టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన రూపొందించిన మాస్ మూవీనే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్
రవితేజ నటించిన 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

15వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'ధమాకా'కు 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో మొత్తంగా రూ. 63 లక్షలు షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ వసూలైంది.
జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

15 రోజుల్లో ఎంత వసూలైంది?
'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 16.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.43 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 4.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.66 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.18 కోట్లు, గుంటూరులో రూ. 1.69 కోట్లు, కృష్ణాలో రూ. 1.62 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో మొత్తంగా రూ. 33.81 కోట్లు షేర్, రూ. 61.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
రవితేజ - శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 15 రోజుల్లో రూ. 33.81 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.54 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 15 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 39.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 101 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

ధమాకా మూవీకి భారీ లాభాలు
ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 15 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 39.60 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.60 కోట్లు లాభాలు దక్కాయి.

మరో రికార్డు.. 40 లక్షలు వస్తే
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన 'ధమాకా' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వచ్చి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ చిత్రం తాజాగా రూ. 20 కోట్ల లాభాల మైలురాయిని చేరుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, దీనికి మరో రూ. 40 లక్షలు షేర్ వసూలు అయితే.. రూ. 40 కోట్లు మార్కును చేరుకుంటుంది.