Don't Miss!
- News
‘కొత్త’ పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ: బీజేపీకి దూరమేనా?, బీఆర్ఎస్పై జనసేనాని ఇలా
- Lifestyle
మీకు ఉన్న ఈ చెడు అలవాట్లే..ఎంత ధనవంతులైనా..బిచ్చగాడిగా మార్చేస్తుంది జాగ్రత్త!వెంటనే మానుకోండి
- Sports
IND vs NZ: రజత్ పటిదార్, కేఎస్ భరత్ అవకాశం ఇవ్వరా?.. వాటర్ బాటిళ్లు మోసేందుకే ఎంపిక చేశారా?
- Technology
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- Finance
Google: గూగుల్ ఉద్యోగులను తొలగించాలంటూ పెరుగుతున్న డిమాండ్.. అసలేం జరుగుతోంది..?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
- Automobiles
మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట 'కేఎల్ రాహుల్-అతియా శెట్టి' లగ్జరీ కార్లు.. ఇక్కడ చూడండి
Dhamaka 16 Days Collections: రవితేజ మరో సెన్సేషన్.. టాప్ మూవీగా ధమాకా రికార్డు.. లాభాలే అన్ని కోట్లు
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతోన్నాడు మాస్ మహారాజా రవితే. సినిమా ఫలితాలను ఏమాత్రం పట్టించుకోని అతడు.. కనీసం ఏడాది రెండు చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే రవితేజ 'ధమాకా' అనే కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మూడో వారంలోనూ కలెక్షన్లు పోటెత్తుతన్నాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ 16 రోజుల్లో ఎంత వసూలు మీరే చూసేయండి!

ధమాకా అని వచ్చిన మాస్ హీరో
మాస్ మహారాజా రవితేజ - త్రినాథరావు నక్కిన కలయికలో వచ్చిన మూవీనే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలను చేశారు.
49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన హీరోయిన్: అది డ్రెస్సా? చేపలు పట్టే వలా?

ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్
టాలీవుడ్ స్టార్ రవితేజ మార్కెట్‌కు అనుగుణంగానే 'ధమాకా'కు నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ జరిగింది.

16వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
16వ రోజు 'ధమాకా'కు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరింత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 43 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో మొత్తంగా రూ. 84 లక్షలు షేర్, రూ. 1.55 కోట్లు గ్రాస్ వసూలైంది.
బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

16 రోజుల్లో ఎంత వసూలైంది?
'ధమాకా' మూవీ 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగానే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 16.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.58 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 4.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.70 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.20 కోట్లు, గుంటూరులో రూ. 1.73 కోట్లు, కృష్ణాలో రూ. 1.65 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో మొత్తంగా రూ. 34.65 కోట్లు షేర్, రూ. 63.21 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లిలా
రవితేజ - శ్రీలీల కాంబోలో చేసిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 16 రోజుల్లో రూ. 34.65 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.60 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 16 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 104 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

ధమాకా మూవీకి భారీ లాభాలు
పక్కా కమర్షియల్ అంశాలతో వచ్చిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 40.60 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.60 కోట్లు లాభాలు దక్కాయి.

రవితేజ కెరీర్‌లో గొప్ప మూవీ
రెండు ఫ్లాపుల తర్వాత ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న లక్ష్యంతో రవితేజ నటించిన చిత్రమే 'ధమాకా'. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వచ్చి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. దీంతో ఈ మూవీ రూ. 40 కోట్లు షేర్ మార్కును చేరుకుని సత్తా చాటింది. అలాగే, రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు నమోదు చేసింది.