twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhamaka Collections: 19 కోట్ల టార్గెట్.. వారంలోనే షాకింగ్‌గా.. అన్ని కోట్లతో రవితేజ సంచలన రికార్డ్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి.. ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లకు ఆదర్శంగా నిలిచిన హీరో రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ ప్రేమను గెలుచుకుని మాస్ మహారాజా అనిపించుకుంటోన్న అతడు.. హిట్లు ఫ్లాపులను చూడకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే రెండు ఫ్లాపుల తర్వాత ఇప్పుడు రవితేజ 'ధమాకా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ధమాకా' మూవీ వారం రోజుల రిపోర్టును మీరే చూడండి!

    ధమాకా చూసేందుకు వచ్చాడు

    ధమాకా చూసేందుకు వచ్చాడు

    మాస్ మహారాజా రవితేజ - త్రినాథరావు నక్కిన రూపొందించిన చిత్రమే 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ దీనికి సంగీతం ఇచ్చాడు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు.

    నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖినీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి

    ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

    ధమాకా మూవీ బిజినెస్ డీటేల్స్

    రవితేజ హీరోగా చేసిన 'ధమాకా' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. దీనికి నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.00 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్‌లో కలిపి రూ. 2.30 కోట్లతో.. ఓవరాల్‌గా ఈ మూవీకి రూ. 18.30 కోట్ల బిజినెస్ అయింది.

    7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

    7వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

    'ధమాకా' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు మంచి వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 77 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో మొత్తంగా రూ. 1.42 కోట్లు షేర్, రూ. 2.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన
    https://telugu.filmibeat.com/heroine/actress-ketika-sharma-shares-sizzling-pics-in-instagram-115920.html

    వారంలో ఎంత వసూలైంది?

    వారంలో ఎంత వసూలైంది?

    వారం రోజుల్లో 'ధమాకా' మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 10.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.81 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.68 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.12 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, గుంటూరులో రూ. 1.25 కోట్లు, కృష్ణాలో రూ. 1.15 కోట్లు, నెల్లూరులో రూ. 61 లక్షలతో మొత్తంగా రూ. 21.65 కోట్లు షేర్, రూ. 39.45 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

    రవితేజ - శ్రీలీల జోడీగా చేసిన 'ధమాకా' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 21.65 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.01 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.56 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.22 కోట్లు షేర్‌తో పాటు రూ. 62 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

    ధమాకా మూవీకి లాభాలు ఇలా

    ధమాకా మూవీకి లాభాలు ఇలా

    త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటించిన 'ధమాకా' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 25.22 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.22 కోట్లు లాభాలు దక్కాయి.

    రవితేజ కెరీర్‌లోనే టాప్ ప్లేస్

    రవితేజ కెరీర్‌లోనే టాప్ ప్లేస్

    రవితేజ హీరోగా చేసిన 'ధమాకా' మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఈ చిత్రం వారం రోజుల్లోనే రూ. 60 కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. ఫలితంగా రవితేజ కెరీర్‌లోనే వేగంగా ఈ మార్క్ చేరిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది. దీనికితోడు ఈ మూవీ వరుసగా 7 రోజులు కోటి రూపాయలకు పైగానే షేర్‌ను రాబట్టి రికార్డు సాధించింది.

    English summary
    Ravi Teja Now Doing Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. This Movie Collects 25.22 CR in 1st Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X