Don't Miss!
- News
`అందులో తెలంగాణ సీఎం కూడా భాగస్వామే`: బాంబు పేల్చిన చంద్రబాబు: రామ్ మాధవ్ ఏం చెబుతారు?
- Finance
pak debts: IMF ముందు బోర్లా పడిన పాకిస్థాన్.. బెయిలౌట్ బాటలో మరో ఎదురుదెబ్బ
- Lifestyle
Valentines Day Destinations 2023: వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Travel
సందర్శకులను సంగమేశ్వరం ఆహ్వానిస్తోంది!
- Sports
Border-Gavaskar Trophy: అప్పుడు భారత్‌ను గెలిపించింది.. ఇప్పుడు ఆడుతున్నది ఆ నలుగురే!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Dhamaka Pre Release Bussiness: ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసిందంటే.. బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్!
మాస్ మహారాజ రవితేజ నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. త్రినాధ రావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత బిజినెస్ చేసింది అలాగే సక్సెస్ కావాలి అంటే మొత్తం ఎంతో వెనక్కి తీసుకురావాలి అనే వివరాల్లోకి వెళితే..

క్రాక్ తరువాత..
మాస్ మహారాజా రవితేజ గత రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. క్రాక్ సినిమా తర్వాత చేసిన ఖిలాడి సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా తీవ్రస్థాయిలో నష్టాలను కలిగించాయి. అయినప్పటికీ కూడా రవితేజ మార్కెట్ అయితే ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ధమాకా సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇక శుక్రవారం రోజు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

ఆంధ్ర, తెలంగాణ బిజినెస్
ధమకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి రేటు పలికినట్లుగా తెలుస్తోంది. నైజాం ఏరియాలో రూ.5.5 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా సిడెడ్ ఏరియాలో రూ.2.5 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో రూ.8 కోట్లు బిజినెస్ చేసిన ధమాకా సినిమా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే రూ.16 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తం బిజినెస్
ఇక రవితేజ ధమాకా సినిమా కర్ణాటకలో కూడా డీసెంట్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకొని మొత్తంగా ఈ సినిమా 2.30 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దమాకా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 18.30 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్
రవితేజ సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద 19 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఫిక్స్ అయింది. క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ రవితేజ ఈ స్థాయిలో అయితే టార్గెట్ పూర్తి చేయలేదు. మరి ధమాకా సినిమా ఆ రెంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

రవితేజ గత 5 సినిమాలు
రవితేజ ఇంతకుముందు నటించిన ఐదు సినిమాల వరల్డ్ వైడ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డిస్కో రాజా సినిమా రూ.19.2 కోట్లు బిజినెస్ చేయగా క్రాక్ రూ.17 కోట్లు, ఖిలాడి రూ.22 కోట్లు రామారావు రూ.17.20 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ అయితే చేశాయి. ఇక ఇప్పుడు దాదాపు అదే రేంజ్ లో ధమాకా సినిమా రూ.18.30 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. క్రిస్మస్ హాలిడేస్ తో పాటు న్యూ ఇయర్ కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ కు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.