twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Khiladi 8 Days Collections: 8వ రోజు దారుణంగా ఖిలాడి కలెక్షన్లు.. హిట్ అవ్వాలంటే అలా జరగాల్సిందే!

    |

    కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. గత ఏడాది వచ్చిన 'క్రాక్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఈ జోష్‌తోనే ఆ వెంటనే అతడు రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమాను చేశాడు.

    ఎన్నో ఆటంకాల తర్మాత ఇది షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అలాగే, విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభం నుంచే ఇది కలెక్షన్లను రాబట్టడంలో విఫలం అవుతోంది. ఈ నేపథ్యంలో 'ఖిలాడి' మూవీ ఎనిమిది రోజుల వరకూ ఎంత వసూలు చేసిందో మీరూ చూసేయండి మరి!

     ‘ఖిలాడి'గా రవితేజ విశ్వరూపం

    ‘ఖిలాడి'గా రవితేజ విశ్వరూపం

    మాస్ మహారాజా రవితేజ - రమేష్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'ఖిలాడి'. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు.

    బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!

    ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

    ప్రపంచ మొత్తం జరిగిన బిజినెస్

    యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఖిలాడి'కి తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలనూ కలుపుకుంటే.. ఈ చిత్రానికి మొత్తంగా రూ. 22.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    8వ రోజు ఎంత వసూలు చేసింది?

    8వ రోజు ఎంత వసూలు చేసింది?

    'ఖిలాడి' మూవీకి 8వ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 23 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వచ్చింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీబాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

    8 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    8 రోజులకూ కలిపి వచ్చిందెంత?

    8 రోజులకు రవితేజ మూవీకి ఏపీ, తెలంగాణలో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 76 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 62 లక్షలు, గుంటూరులో రూ. 1.05 కోట్లు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 51 లక్షలతో కలుపుకుని రూ. 10.56 కోట్లు షేర్, రూ. 17.92 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఖిలాడి వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా

    ఖిలాడి వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇలా

    8 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 10.56 కోట్లు వసూలు చేసిన 'ఖిలాడి' మూవీ.. మిగిలిన చోట్లా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 82 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 48 లక్షలు, హిందీలో రూ. 64 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.50 కోట్లు షేర్, రూ. 22.30 కోట్లు గ్రాస్ దక్కింది.

    హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఖిలాడి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 22.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 23.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఎనిమిది రోజుల్లో దీనికి రూ. 12.50 కోట్లు వచ్చాయి. అంటే మరో 11 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Mass Maharaj Ravi Teja Did Khiladi Movie Under Ramesh Varma Direction. This Movie Collect 12.50 Cr in 8 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X