Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Ramarao On Duty 1st Week Collections: 18 కోట్ల టార్గెట్.. వారంలో మరీ ఘోరంగా.. అన్ని కోట్లు వస్తేనే!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన చిత్రాలతో స్టార్‌గా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. హీరోగా మారిన కొత్తలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది 'ఖిలాడి' అనే సినిమా చేసిన రవితేజ.. గత వారమే ''రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు.. తెలుగు ప్రేక్షకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన దక్కడం లేదు. ఫలితంగా కలెక్షన్లు డ్రాప్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' వారం రోజుల్లో ఎంత వసూలు చూద్దాం పదండి!

రామారావుగా ఎంట్రీ ఇచ్చిన స్టార్
మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మందవ తెరకెక్కించిన సినిమానే 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేశాడు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం సమకూర్చాడు.
షర్ట్ విప్పేసి మరీ సమీరా రెడ్డి అందాల ఆరబోత: ఎన్టీఆర్ హీరోయిన్ ఇలా మారిందేంటి!

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్
రవితేజ మార్కెట్‌కు ప్రకారమే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 17.20 కోట్ల మేర బిజినెస్‌ను జరుపుకుంది.

7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంత
ఫుల్
లెంగ్త్
మాస్
యాక్షన్
ఎంటర్‌టైనర్‌గా
రూపొందిన
'రామారావు
ఆన్
డ్యూటీ'కి
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణలో
ఆశించిన
రీతిలో
రెస్పాన్స్
దక్కడం
లేదు.
దీంతో
ఆ
ప్రభావం
కలెక్షన్లపై
తీవ్ర
స్థాయిలో
చూపించింది.
దీంతో
ఓపెనింగ్
డే
నుంచే
ఈ
సినిమాకు
వసూళ్లు
క్రమంగా
పడిపోతున్నాయి.
ఈ
నేపథ్యంలో
7వ
రోజు
రవితేజ
సినిమాకు
కలిపి
కేవలం
రూ.
6
లక్షలే
వచ్చాయి.
నువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీ

వారం రోజుల్లో ఎంతొచ్చిందంటే
'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లోనూ నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 1.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 21 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 16 లక్షలతో కలిపి రూ. 4.20 కోట్లు షేర్, రూ. 7.17 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
ఆంధ్రా, తెలంగాణలో వారం రోజుల్లో రూ. 4.20 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.05 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.91 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
Bimbisara Twitter Review: బింబిసారకు అలాంటి టాక్.. అఖండ, RRR తర్వాత ఇదే.. అదొక్కటే పెద్ద మైనస్

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
టాలీవుడ్ స్టార్ రవితేజ - శరత్ మందవ కలయికలో వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, వారంలో ఈ సినిమాకు రూ. 5.05 కోట్లు వచ్చాయి. అంటే మరో 12.95 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.