Don't Miss!
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Ramarao On Duty Day 1 Collections: రవితేజ సినిమాకు షాక్.. తొలిరోజే ఇంత తక్కువ.. కెరీర్‌లోనే ఘోరంగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ ఏడాది ఆరంభంలోనే 'ఖిలాడీ' అనే మూవీతో వచ్చిన రవితేజ.. తాజాగా 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఊహించని విధంగా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్ట్ డే రిపోర్టును చూద్దాం పదండి!

రామారావుగా డ్యూటీలోకి రవితేజ
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మందవ తెరకెక్కించిన ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ఇందులో వేణు తొట్టెంపూడి కీలకమైన పాత్రను చేసిన విషయం తెలిసిందే.
షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

బిజినెస్ తగ్గట్లుగా గ్రాండ్ రిలీజ్
రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 7 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 17.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.

అలాంటి టాక్.. వసూళ్లపై ఎఫెక్ట్
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన మాస్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే నెగెటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు వెల్లడించారు.
Mehreen Kaur Pirzada: మెహ్రీన్ అందాల విందు.. అబ్బో ఆమె డ్రెస్ చూస్తే!

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'రామారావు ఆన్ డ్యూటీ'కి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 85 లక్షలు, సీడెడ్‌లో రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రూ. 2.82 కోట్లు షేర్, రూ. 4.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
తెలుగు రాష్ట్రాల్లో నిరాశ పరుస్తూ రూ. 2.82 కోట్లు రాబట్టిన 'రామారావు ఆన్ డ్యూటీ' ప్రపంచ వ్యాప్తంగానూ రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 35 లక్షలు మాత్రమే వసూలు చేసింది.వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 3.42 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.95 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
రవితేజ - శరత్ కాంబినేషన్‌లో వచ్చిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 3.42 కోట్లు వచ్చాయి. అంటే మరో 14.58 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

రవితేజ కెరీర్‌లో రెండో అత్యల్పం
'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ ఎన్నో అంచనాలతో వచ్చినా నిరాశను కలిగించేలా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఫలితంగా ఆంధ్రా, తెలంగాణలో కలిపి మొదటి రోజు రూ. 2.82 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన రవితేజ చిత్రాల్లో రెండో అత్యల్ప ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. గతంలో 'డిస్కో రాజా'కు మాత్రమే రూ. 2.54 కోట్లు వచ్చాయి.