»   » మళ్లీ వాయిదా : 'బెంగాల్‌ టైగర్‌' కొత్త రిలీజ్ డేట్

మళ్లీ వాయిదా : 'బెంగాల్‌ టైగర్‌' కొత్త రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. సంపత్‌నంది డైరక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న విడుదల అవుతుందని డేట్ ఫిక్స్ చేసారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 10కు వాయిదా పడిందని సమాచారం.

మరో ప్రక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ 7.6 కోట్లు రికార్డు రేటు పలికింది. తెలుగులో ఓ లీడింగ్ ఛానెల్ ఈ చిత్రం రైట్స్ ని సొంతం చేసుకుంది. రిలీజైన రెండు నెలలు లోపే ఈ చిత్రం టీవి ఛానెల్ లో వేయటానికి ఎగ్రిమెంట్ రాసుకున్నట్లు సమాచారం. కిక్ 2 వంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత కూడా ఈ స్ధాయి రేటు రావటం మామూలు విషయం కాదని ట్రేడ్ లో వినిపిస్తోంది.


Ravi Teja's Bengal Tiger postponed to December 10th

రవితేజ మాట్లాడుతూ... ''సినిమా బాగా వచ్చింది. బీమ్స్‌ మంచి పాటలిచ్చాడు. తమన్నా అక్షర దోషాలు లేకుండా తెలుగు బాగా మాట్లాడుతోంది. ఆమెను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాలుగైదు సినిమాల తరవాత రాశీ ఖన్నా ఇలానే తెలుగు మాట్లాడాలి. సంపత్‌కి హ్యాట్రిక్‌ సినిమా అవుతుందని నా నమ్మకము''అన్నారు.


దర్శకుడు చెబుతూ.... ''నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి రవితేజ. ఒకే సిట్టింగ్‌లోనే కథ ఓకే చేశారు. బీమ్స్‌కి నేనేదో లైఫ్‌ ఇచ్చాననుకొంటున్నారు. ఆ ఘనతా రవితేజగారిదే. రవితేజ అభిమానులకు వెయ్యి శాతం సంతృప్తినిచ్చే సినిమా ఇది''అన్నారు.

English summary
Ravi Teja's Bengal Tiger has been postponed again from November 27th to December 10th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu