»   »  పూర్తి డ్రాప్ : 'కిక్‌-2' లాస్ ఎంత?

పూర్తి డ్రాప్ : 'కిక్‌-2' లాస్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొంది మొన్న శుక్రవారం విడుదలైన చిత్రం ‘కిక్‌-2'. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. ఈ చిత్రం సెకండాఫ్ బోర్ కొట్టిందని,ఎంటర్టైన్మెంట్ తక్కువైందని కంప్లైంట్ లు వచ్చాయి. దాంతో చిత్రం కు నెగిటివ్ టాక్ వచ్చేసింది.

దాంతో వెంటనే దర్శక,నిర్మాతలు రంగంలోకి దిగి సెకండాఫ్ ని ఇరవై నిముషాలు కట్ చేసి,ట్రిమ్ చేసి వదిలారు. అయినా ఈ సినిమాకు లాస్ లు తప్పేటట్లు లేవు. దాదాపు 10 కోట్లు లాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.


ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవటం మొదలయ్యాయి. సోమవారం,మంగళవారం, బుధవారం మూడు రోజులు పూర్తిగా కలెక్షన్స్ తగ్గిపోవటం మొదలైంది. మరో ప్రక్క మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం హౌస్ ఫుల్స్ తో దూసుకుపోతోంది.


 Ravi Teja's Kick 2 loss ?

'కిక్‌-2' 5 రోజుల షేర్స్ చూడండి.


'కిక్‌-2' 5 రోజుల షేర్స్


తూర్పు గోదావరి


రోజు1- 54 లక్షలు


రోజు2- 23 లక్షలు


రోజు3 - 33 లక్షలు


రోజు4 - 11 లక్షలు


రోజు5 - 8 లక్షలు


మొత్తం - 1.29 కోట్లు


కృష్ణా


రోజు1- 31 లక్షలు


రోజు2- 20 లక్షలు


రోజు3 - 29 లక్షలు


రోజు4 - 6 లక్షలు


రోజు5 - 3 లక్షలు


మొత్తం - 89 లక్షలు


నెల్లూరు


రోజు1- 20 లక్షలు


రోజు2- 8 లక్షలు


రోజు3 - 9 లక్షలు+


రోజు 4 - 4 లక్షలు


రోజు5 - 3 లక్షలు


మొత్తం - 44 లక్షలు+


నైజాం


రోజు1- 2.15 కోట్లు


రోజు2- 1.35 కోట్లు


రోజు3 - 1.5 కోట్లు


రోజు4 - 0.4 కోట్లు


మొత్తం - 5.4 కోట్లు


సీడెడ్


రోజు1- 87 లక్షలు


రోజు2- 51 లక్షలు


రోజు3 - 54 లక్షలు


రోజు4 - 17 లక్షలు


మొత్తం - 2.09 కోట్లు


వైజాగ్


రోజు1- 45 లక్షలు


రోజు2- 21 లక్షలు


రోజు3 - 32 లక్షలు


మొత్తం - 98 లక్షలు


పశ్చిమ గోదావరి


రోజు1- 63 లక్షలు


రోజు2- 10 లక్షలు


రోజు3 - 13 లక్షలు


మొత్తం - 86 లక్షలు


గుంటూరు


రోజు1- 62 లక్షలు


రోజు2- 22 లక్షలు


రోజు3 - 26 లక్షలు


మొత్తం - 1.1 కోట్లుసురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ''దర్శకుడిగా పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిన చిత్రం 'కిక్‌ 2'. ఇదివరకు తీసిన 'కిక్‌'లో వినోదమే ఎక్కువ. ఈసారి వినోదంతోపాటు భావోద్వేగాలు ఉండాలనుకొన్నా. ఒక కథలో రెండింటినీ సమపాళ్లలో జోడించడం ఆషామాషీ కాదు. చాలా జాగ్రత్తలు తీసుకొని చిత్రాన్ని తీర్చిదిద్దా. విరామం తర్వాత వినోదం కాస్త తక్కువైందనే ఫిర్యాదులొచ్చాయి. దీంతో కొన్ని సన్నివేశాల్ని తొలగించాం'' అన్నారు.


అలాగే...''కొత్తగా ఏ ప్రయత్నం చేసినా సంతృప్తి లభిస్తుంది. తరచుగా ప్రేక్షకుల ముందుకొచ్చే చిత్రాలకి భిన్నంగా 'కిక్‌ 2' చేశా. మా ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ సినిమాకి 'రేసుగుర్రం' తరహాలో ప్రారంభవసూళ్లు లభించాయి''అన్నారు సురేందర్‌రెడ్డి.


'కిక్‌ 2' మొదలైన విధానం గురించి చెబుతూ ....


''రేసుగుర్రం' తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనుకొన్నా. ఇంతలో కల్యాణ్‌రామ్‌ఈ సినిమా చేద్దామన్నారు. భారీ హంగులతో కూడిన కథ కావడంతో బడ్జెట్‌ ఎక్కువే అవుతుందని ముందుగానే వూహించాం. కల్యాణ్‌రామ్‌ లేకపోతే 'కిక్‌ 2'నే లేదు. ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశాడు. సినిమాలో అడుగడుగునా నిర్మాణ విలువలు కనిపిస్తాయి. రవితేజ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది''అన్నారు.


రామ్ చరణ్ తోనూ...


'కిక్‌2'ని హిందీలో తీయడంతో పాటు, కొనసాగింపుగా 'కిక్‌ 3'ని తీసే ఆలోచనలున్నాయని సురేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తదుపరి రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నట్టు ఆయన తెలిపారు.


ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ స్వరాలు అందించారు. తాజా చిత్రంలో రవితేజ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రవికిషన్‌ కీలక పాత్రధారులు. గతంలో మంచి 'కిక్‌' ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'కిక్‌-2' కావటంతో మంచి అంచనాలతోనే విడుదలైంది.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ‘కిక్‌'కు సీక్వెల్‌ కాదు. కానీ అందరికీ డబుల్‌ కిక్‌ ఇస్తుంది. ‘కిక్‌'లో రవితేజ, ఇలియానా జంటగా నటించారు. వాళ్లిద్దరి కొడుకు కథే ‘కిక్‌-2'. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో క్లైమాక్స్‌ను భారీగా తెరకెక్కించాం. '' అని తెలిపారు.


నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ‘‘అతనొక్కడే వంటి హిట్‌ తర్వాత సురేందర్‌రెడ్డి మా సంస్థలో చేసారు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను రూపొందించాం.''అని తెలిపారు.


ఈ చిత్రంలో రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Raviteja starrer 'Kick 2' was seeing drastic Drops in Collections. As per the early estimates the film is going to end with loss of nearly ten crores at BO.
Please Wait while comments are loading...