Don't Miss!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Ramarao On Duty: షాకిస్తోన్న రామారావు థియేటర్ల లెక్క.. రవితేజ కెరీర్‌లోనే!
స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్‌ను ఆరంభించిన అతడు.. ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత సోలో హీరోగా మారాడు. ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. మధ్యలో చాలా పరాజయాలను చవి చూసిన రవితేజ.. గత ఏడాది వచ్చిన 'క్రాక్'తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తోన్నాడు.
Vikrant Rona Twitter Review: సుదీప్ మూవీకి అలాంటి టాక్.. కేజీఎఫ్‌ను మించేలా.. ఫైనల్ రిపోర్ట్ ఇదే
ఈ ఏడాది ఆరంభంలో రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడీ' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు భారీ షాకిచ్చారు. దీంతో ఈ చిత్రం ఎక్కువ నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్‌గా మిగిలింది. అయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహ పడని ఈ స్టార్ హీరో.. ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రంతో రాబోతున్నాడు. శరత్ మందవ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలా అవాంతరాల నడుమ కొద్ది నెలల క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేసేశారు.

తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తోన్న రామారావు అనే ఆఫీసర్.. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై ఎలా పోరాటం చేశాడు? అనే నేపథ్యంతో 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ తెరకెక్కింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా మంచి మెసేజ్‌తో రూపొందినట్లు తెలుస్తోంది. ఇక, మూవీ జూలై 29న విడుదల కాబోతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, ఈరోజు సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Eesha Rebba అందాల అరాచకం: అబ్బో ఆమె ఫోజులు చూస్తే!
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని బిజినెస్ భారీ మొత్తంలో జరిగింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 235, సీడెడ్‌లో 120, ఆంధ్రాలో 315 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 670 నుంచి 700 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 80, ఓవర్సీస్‌లో 250 థియేటర్లలో రాబోతుంది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1000 నుంచి 1050 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా రవితేజ కెరీర్‌కు తగ్గట్లుగానే ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మందవ తెరకెక్కించిన ఈ మూవీలో ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా నటిస్తోన్నాడు.