Don't Miss!
- Finance
Bank Fraud: బయటపడ్డ వేల కోట్ల లోన్ కుంభకోణం.. కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ
- News
YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు! అవినాష్ కు సీబీఐ నోటీసులతో!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Dhamaka Day 2 Collections: రవితేజ మాస్ 'ధమాకా' కంటిన్యూ.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజా రవితేజ మరోసారి డబుల్ ట్రీట్ తో వచ్చిన చిత్రం ధమాకా. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీలో 'పెళ్లి సందD' ఫైమ్ శ్రీలీలా హీరోయిన్‌గా అలరించింది. రెండు వరుస అపజయాల తర్వాత ఎలాగైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ డబుల్ ఇంపాక్ట్ మూవీ ధమాకా డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తో కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోన్న ఈ చిత్రం రెండో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు సమాచారం. నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ. 32 కోట్ల సాధించగా.. ఇక థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ. 18.30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారం రవితేజ ధమాకా చిత్రం విడుదలకు ముందే రూ. 10 కోట్ల లాభాలను తీసుకొచ్చినట్లు అర్థమవుతోంది.

థియేటర్స్ కౌంట్ ఎలా ఉందంటే..
రవితేజ సరసన తొలిసారిగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమైన పాత్రల్లో అలరించారు. ఇక ఈ సినిమాలో రవితేజ ఒకవైపు మాస్ మరొకవైపు క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తంగా 670 థియేటర్లలో విడుదల చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ధమాకా థియేటర్ల సంఖ్య 940 కి పైగానే ఉందని సమాచారం.

ధమాకా ఆక్యుపెన్సీ..
ఇక రవితేజ ధమాకాకు రెండో రోజు ఉదయం షోలకు 18.11 శాతం థియేటర్ ఆక్యుపెన్సి తో కొనసాగగా ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి కాస్తా పెరిగి 32.98 శాతంగా నమోదైంది. ఇక సాయంత్రం షోలకు ఇంకాస్తా పెరుగుతూ 45.99 శాతంగా ఆక్యుపెన్సీ నెలకొంది. అలాగే హైదరాబాద్ లో 36.33%, బెంగళూరు 19.33%, చెన్నై 56.67%, ముంబై 32 % గా ధమాకా రెండో రోజు ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం.

రెండో రోజు కలెక్షన్స్..
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ధమాకా సినిమాకు సాంగ్స్ కొంత బజ్ తీసుకు వచ్చాయి. దీంతో ఓపెనింగ్స్ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా మొత్తంగా ధమాకా చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 12.20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తొలి రోజు వచ్చిన కలెక్షన్స్!
ఇదిలా ఉంటే ధమాకా సినిమా మొదటి రోజు ఏపీ, తెలంగాణలో మొత్తంగా రూ. 4.5 కోట్ల షేర్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 45 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 15 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 5.5 కోట్లు షేర్, రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది.