»   »  అదీ రీజన్ : 'శ్రీమంతుడు' టైటిల్ ఎందుకు పెట్టామంటే?

అదీ రీజన్ : 'శ్రీమంతుడు' టైటిల్ ఎందుకు పెట్టామంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఓ స్టార్ హీరో చిత్రానికి ఇలాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం వెనక కారణమేంటనే సందేహం అందరికీ కలుగుతోంది. దీనికి దర్శకుడు కొరటాల శివ ఏం సమాధానం చెప్తారో చూద్దాం.

శ్రీమంతుడు టైటిల్‌ వెనుక కసరత్తు గురుంచి కొరటాల శివ మాట్లాడుతూ... కథ రాసుకొన్నప్పుడు, షూటింగ్‌ జరుగుతున్నప్పుడు టైటిల్‌ గురించి ఏమీ అనుకోలేదు. బయట రకరకాల టైటిళ్లు ప్రచారంలోకొచ్చాయి. శ్రీమంతుడు కథ ఇది.. అతని జీవితం చుట్టూ తిరుగుతుంది. ఏ టైటిల్‌ పెట్టినా కథ ముందు చిన్నబోతోంది. అదీ ఇదీ ఎందుకని 'శ్రీమంతుడు'నే ఫిక్స్‌చేశాం. అన్ని రకాల ఎమోషన్స్‌ ఈ టైటిల్‌లో కనిపించాయి అన్నారు.


'శ్రీమంతుడు' గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీ ప్రపంచం. మహేష్‌ కూడా 'ఈసారి హిట్టుకొట్టడం ఖాయం' అంటున్నారు. సినిమాపై మహేష్‌, ఆయన అభిమానులు ఎంత నమ్మకంతో ఉన్నారో, నేనూ అంతే నమ్మకంతో ఉన్నా. ఖచ్చితంగా అందరి అంచనాలూ అందుకొనేలా ఉంటుందీ చిత్రం అన్నారు కొరటాల శివ.


ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కృష్ణా జిల్లా రైట్స్ ని రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నట్లు ట్రైడ్ వర్గాల సమాచారం. అభిషేక్ పిక్చర్స్ వారు భాగస్వామ్యంగా ఉంటున్నారు. పోస్టర్ అండ్ పబ్లిసిటీతో కలిపి మూడు కోట్లుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.


అలాగే...ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మొత్తం 17 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అందులో తెలుగుకు 12 కోట్లు, హిందీ శాటిలైట్ రైట్స్ 5 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. జీ తెలుగు వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు వినికిడి.


Reason behind Mahesh babu's Srimanthudu title

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.


కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.


దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.


నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.


శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది

English summary
Mahesh Babu's upcoming release Srimanthudu is riding on high expectations. Recently launched audio songs are already topping the music charts. Srimanthudu is making a merry at the box office. Already the movie is being picked up for record prices in many areas.
Please Wait while comments are loading...