twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేరళలో రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ చరణ్

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ చరణ్,అల్లు అర్జున్ నటించిన 'ఎవడు' చిత్రం మళయాళి వెర్షన్ కేరళ అంతటా భారీ ఎత్తువ జనవరి 31న విడుదల అయిన సంగతి తెలిసిందే. భయ్యా టైటిల్ తో ఈ చిత్రం దాదాపు 90 కి పైగా థియోటర్స్ లో విడుదల చేసారు. రిలీజ్ కు ముందే మంచి పబ్లిసిటీలో క్రేజ్ తేవటంతో మంచి ఓపినింగ్స్ సైతం వచ్చాయి. ఇప్పుడీ చిత్రం అక్కడ శాటిలైట్ రైట్స్ కూడా 65 లక్షలకు అమ్ముడు పోయి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓ తెలుగు డబ్బింగ్ సినిమాకు ఈ రేంజి శాటిలైట్ రేటు రావటం రికార్డ్ అని అక్కడ ట్రేడ్ లో ప్రముఖంగా చెప్తున్నారు.

    అలాగే ఈ చిత్రం రెండు వారాల్లో రెండు కోట్లు షేర్ సంపాదించి డబ్బింగ్ లలో హైయిస్ట్ గ్రాసర్ గా నిలించింది. మళయాళ వెర్షన్ కు గానూ...భయ్యా అనే టైటిల్ పెట్టారు. మై బ్రదర్ అనేది ట్యాగ్లైన్. కె.మంజు అనే నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ కి అక్కడున్న క్రేజ్ కూడా చిత్రానికి ప్లస్ అవుతోంది. అక్కడ రివ్యూలు కూడా మూడు,మూడున్నర స్టార్స్ తో కమర్షియల్ హిట్ గా చిత్రాన్ని థృవీకరించారు.

    చిత్ర దర్శకులు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ 3 సంవత్సరాలపాటు నిద్రకు దూరమయ్యానని, ఇంత కష్టానికి ప్రేక్షకులు అందించిన తీయని విజయం సంతోషాన్నిస్తోందన్నారు. తెలుగు ప్రజలున్నంత కాలం తెలుగు చిత్రసీమ పదిలంగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణ మరువరానిదని కృతజ్ఞతలు తెలిపారు. కథాపరంగా రామ్‌చరణ్‌తోపాటు మరో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ కేవలం కథను నమ్మి ఈ సినిమాలో నటించటం ఎప్పటికీ మరచిపోలేనన్నారు.

    దిల్‌రాజు మాట్లాడుతూ సంవత్సరంన్నర పాటు శ్రమించి ఎవడు చిత్రీకరించామని 6 నెలల పాటు కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయామన్నారు. చిత్రం విడుదల ఆలస్యం కావటంతో అనేక వదంతులు వచ్చాయని, వేటినీ తాము లెక్కచేయలేదని, కథాబలం ఉండటం వలనే ప్రేక్షకులు చిత్రానికి విజయం అందిచారన్నారు.

    English summary
    
 Satellite rights of 'Bhaiyya' (Malayalam version of Ram Charan Yevadu) have been sold out for a whooping Rs 65 lakhs to Mazhavil Manorama. This is the highest price ever for a Telugu film dubbed in Malayalam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X