twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్… ఇదిగోండి ఫైనల్ లిస్టు!

    |

    ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులకు అలాగే తెలుగు సినిమా లవర్స్ కు ఉన్నంత కన్ఫ్యూజన్ మరి ఎవరికి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు.. ఎందుకంటే పెద్ద సినిమాలు అలాగే బాగా ఎదురుచూస్తున్న సినిమాలు అని భావిస్తున్న అన్ని సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే కొన్ని సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించి ఉండగా మరికొన్ని సినిమాలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే టాలీవుడ్ ప్రేక్షకులు సహా ఇండియా లెవల్లో అందరూ ఎదురుచూస్తున్న కొన్ని సినిమాల విడుదల తేదీలు ఈ మేరకు ఉన్నాయి.

    సంక్రాంతి సీజన్ కు భారీ పోటీ

    సంక్రాంతి సీజన్ కు భారీ పోటీ


    వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు భారీ పోటీ నెలకొంది.. కేవలం సంక్రాంతి మూడు రోజుల్లో మూడు పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఇప్పటికే ప్రకటన చేయగా మరో సినిమా కూడా అదే నెలలో రావడానికి సిద్ధం అవుతోంది. ఇక చిన్నాచితకా సినిమాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే జనవరి నెలలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాణా కాంబినేషన్ లో జరుగుతున్న భీమ్లా నాయక్, మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాలు ఇప్పటికే తేదీలు ఖరారు చేసుకున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమా కూడా అదే నెలలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మార్చ్ నెలలో రాబోతోందని అంటున్నారు.

    భీమ్లా నాయక్ ఎప్పుడంటే?

    భీమ్లా నాయక్ ఎప్పుడంటే?


    పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో భీమ్లా నాయక్ అనే సినిమా రూపొందుతోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోషియుం సినిమాను తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు అందిస్తున్న ఈ సినిమాను సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.. సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలు భారీగా ఉండగా మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ టైటిల్ అనౌన్స్మెంట్ సినిమా మీద ఉన్న ఆసక్తిని డబుల్ చేసింది. ఐశ్వర్య రాజేష్ నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    సర్కారు వారి పాట ఎప్పుడంటే

    సర్కారు వారి పాట ఎప్పుడంటే

    గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ కాంబినేషన్ మీద కూడా ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే మహేష్ బాబు మాస్ లుక్ అలాగే క్లాస్ లుక్ రెండు కలిసిన విధంగా కనిపిస్తూ ఉండటం ఈ సినిమాకి పెద్ద అసెట్. సినిమా నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల అయినప్పటి నుంచి సినిమా మీద ఆసక్తి నెలకొంది. అలాగే బ్యాంకింగ్ మోసాలు నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని తెలియడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    సాహో ఎప్పుడంటే?

    సాహో ఎప్పుడంటే?

    సాహో సినిమా తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా రాధేశ్యామ్. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా జనవరి 14వ తేదీ సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్స్ అలాగే పూజా హెగ్డే తో కనిపించిన చిన్నపాటి టీజర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులు అయితే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

    ఆచార్య ఎప్పుడంటే?

    ఆచార్య ఎప్పుడంటే?

    ఇక ఆచార్య సినిమా అన్ని అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా మహమ్మారి రెండో దశ కూడా విరుచుకుపడడంతో ఈ సినిమా వాయిదా పడింది. కానీ ఎప్పుడు విడుదల చేస్తామనే దాని మీద ఇప్పటివ రకు యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వెలు వడలేదు. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీ దసరా సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా జనవరి ఏడో తారీఖు న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా వెలువడలేదు. అధికారిక ప్రకటన వెలువడితే సినిమా ఎప్పుడు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసే అవకాశం ఉంటుంది.

    Recommended Video

    Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
    ఆర్ఆర్ఆర్ ఎప్పుడంటే?

    ఆర్ఆర్ఆర్ ఎప్పుడంటే?

    రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాతంత్ర సమరయోధులు కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుంది అనే కథతో ఈ సినిమా రూపొందిస్తున్నాడు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వం , ఇద్దరు బడా హీరోలు కలిసి నటిస్తూ ఉండడంతో పాటు భారీ బడ్జెట్తో సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి విపరీతమైన క్రేజ్ నెలకొంది.. నిజానికి ఈ సినిమా అక్టోబర్ 13 2021 తేదీన విడుదల చేస్తామని ముందు నుంచి ప్రచారం చేస్తూ వచ్చినా ఈ సినిమా ఆ రోజున విడుదల చేయడం గగనమే అని అంటున్నారు.ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 31వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది తెలియాల్సి ఉంది.

    English summary
    there is confusion in Tollywood movies release dates. here is the the final is a list of Tollywood movies release dates named r r r, Acharya, Radheshyam Bheemla Nayak and Sarkaru Vaari Paata
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X