హైదరాబాద్ : విజయ్‌కుమార్ కొండ దర్శకత్వంలో నితిన్, నిత్యామీనన్, ఇషాతల్వార్ హీరో,హీరోయిన్ లుగా విక్రమ్‌గౌడ్ సమర్పణలో నిఖితారెడ్డి నిర్మించిన 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రం ఇటీవల విడుదలై అన్ని చోట్లా ప్రజాదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ రైట్స్ బోనీకపూర్ తీసుకున్నట్లు తెలిసింది. రీసెంట్ గా ఈ చిత్రాన్ని ఆయన చూసి, తన కొడుకు అర్జున్ కపూర్ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నిర్మాతలతో డిస్కషన్స్ జరుపుతున్నట్లు వినపడుతోంది. తమిళం నుంచి కూడా రీమేక్ ఆఫర్స్ ఓరేంజిలో వస్తున్నట్లు చెప్తున్నారు.
మరో ప్రక్క చిత్రం తెలుగు శాటిలైట్ రైట్స్ 3.20 కోట్లకు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది. నితిన్ చిత్రాల్లో ఈ రేటు రావటం రికార్డే అంటున్నారు. ఈ చిత్రం రైట్స్ ని జెమినీ వారు సొంతం చేసుకున్నారు. ''ఈ సినిమా బాగా రావడానికి మా నాన్నగారెంత కష్టపడ్డారో నాకు తెలుసు. అందుకే ఈ చిత్రవిజయాన్ని ఆయనకు అంకితమిస్తున్నాను. మొత్తం టీమ్ అంతా అంకితభావంతో చేశారు. అందుకే ఈ విజయం మా అందరికీ దక్కింది'' అన్నారు నితిన్.
అలాగే నితిన్ మాట్లాడుతూ - ''పది ఫ్లాపుల తర్వాత హిట్ ఇచ్చిన చిత్రం 'ఇష్క్'. ఆ చిత్రం ఆడియో వేడుకకు పవన్‌కళ్యాణ్‌గారు రావడం ప్లస్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో పెట్టిన 'ఖుషి'లోని పాట చిత్రవిజయానికి ఓ కారణమయ్యింది'' అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ''క్లాస్, మాస్ తేడా లేకుండా ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటోంది. నితిన్, నిత్యాల నటన అద్భుతం.
నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఫొటోగ్రఫి, కొరియోగ్రఫి, సాంగ్స్, డైలాగ్స్.. అన్నీ బాగా కుదిరాయి'' అన్నారు. విడుదలైన అన్ని సెంటర్లలోనూ హౌస్‌ఫుల్ కలక్షన్స్‌తో సాగడం ఆనందంగా ఉందని నిఖితారెడ్డి చెప్పారు. స్క్రీన్‌ప్లే రైటర్‌గా తన తొలి చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉందని హర్షవర్థన్ చెప్పారు. ఇంకా అనూప్ రూబెన్స్, మధునందన్, కృష్ణచైతన్య, శేఖర్, తదితరులు మాట్లాడారు.
Boney Kapoor who is a master at announcing projects — he does some films also at times — is now toying with the idea of remaking the recently released Telugu film ‘Gunde Jaari Gallanthayyinde’. Kapoor watched the film and loved it. He wants to make the film with his son Arjun Kapoor in the lead and after the son okays the project, Boney will make a proper offer to the producers of the movie to buy off the rights for remaking it in Hindi.
Story first published: Wednesday, April 24, 2013, 12:05 [IST]