»   » ఓ ప్రక్క పవన్ పై ఎటాక్.. మరో ప్రక్క మంచు మనోజ్ కు లాక్

ఓ ప్రక్క పవన్ పై ఎటాక్.. మరో ప్రక్క మంచు మనోజ్ కు లాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఒకే సమయంలో నాలుగైదు టాస్క్ లు పూర్తి చేయగల సమర్దులు అనే సంగతి తెలిసిందే. ఓ ప్రక్కన ట్విట్టర్ లో సర్దార్ ఆడియో పంక్షన్ గురించి విమర్శలు , ప్రశంసలు కురిపిస్తూనే మరో ప్రక్కన తన ఆగిపోయిన చిత్రాన్ని విడుదలకు రెడీ చేసారు.

వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఎటాక్‌'. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను మార్చి 22న విడుదల చేస్తున్నట్లు వర్మ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. దీంతోపాటు సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంచు మనోజ్‌, జగపతిబాబు, సురభి, ప్రకాశ్‌రాజ్‌, వడ్డే నవీన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 'ఎటాక్‌' చిత్రాన్ని ఏప్రిల్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ... వర్మ ట్విట్టర్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. రాంగోపాల్‌వర్మ తన సహజ మార్క్ చిత్రీకరణతో మరోమారు ప్రేక్షకులపై 'ఎటాక్' చేసేందుకు సిద్ధమైయ్యాడని అబిమానులు ఆనందపడుతున్నారు. వడ్డె నవీన్, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, నర్సింగ్ యాదవ్, అభిమన్యసింగ్‌లు ప్రధాన పాత్రధారులుగా నటించారు. నటి సురభి తన అందాల నటనతో సినీ అభిమానులకు మత్తెక్కించనుంది.

RGV's "Attack" Audio releasing tmrw

రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన 'ఎటాక్' చిత్రానికి రవిశంకర్ సంగీతాన్ని సమకూర్చారు. చాలా కాలం క్రితమే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆ మద్య ట్రైలర్లు కూడా విడుదల చేసి హడావుడి చేసారు. ఏమైందో తెలియదు కానీ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు.

అటు మనోజ్ గానీ, ఇటు రామ్ గోపాల్ వర్మ గానీ ఈ సినిమా గురించి ఈ మధ్య ఎక్కడా మాట్లాడలేదు. ఏదో సమస్య ఉండటం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. తాజాగా సమస్యలు ఓ కొలిక్కి రావడంతో ఆడియో రిలీజ్ డేట్ ప్రకటించారు. సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు.

ఈ చిత్రంలో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌ కీలక పాత్రలు పోషించారు. సురభి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పూర్తి యాక్షన్, ఫ్యాక్షన్ అంశాలతో తెరకెక్కింది. మంచు మనోజ్ లోని యాక్షన్ కోణాన్ని పూర్తిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని దగ్గుపాటి రానా తో అనుకున్నారు...కానీ చివరి నిముషంలో సీన్ లోకి మంచు మనోజ్ వచ్చారు. మనోజ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.


అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలం క్రితం హీరో గా రిటైరయ్యి తప్పుకున్న వడ్డే నవీన్ ఇప్పుడు ఈ చిత్రంతో సీన్ లోకి వచ్చారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. మంచు మనోజ్, జగపతిబాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు కరెంట్ తీగ చిత్రం వచ్చింది. సికె ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీ శుభశ్వేతా ఫిలింస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

English summary
Attack movie has been completed a while back, it has been delayed due to unknown reasons. Finally, the audio release date has been announced.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu