twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara: తెలుగులో 'కాంతార' రికార్డు.. 13 రోజుల్లోనే ఊహించని కలెక్షన్లు.. రూ. 50 కోట్ల దిశగా వసూళ్లు

    |

    ఒక చిన్న సినిమాగా విడుదలై ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసిన చిత్రం కాంతార. ముందుగా కన్నడనాట విడుదలైన కాంతార మూవీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కేజీఎఫ్ వంటి భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన హోంబలే ఫిలీంస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. దీంతో మరోసారి హోంబలే ఫీలింస్ అధిక ప్రాతన్యతను సంతరించుకుంది. ఈ సినిమాకు హీరోగా, డైరెక్టర్ గా మెస్మరైజ్ చేశాడు రిషబ్ శెట్టి. ఇప్పుడు ఈ చిత్రం కన్నడతోపాటు మూడు భాషల్లో విడుదలై వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. ముఖ్యంగా తెలుగులో కెలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

    రూ. 2.00 కోట్లకు సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్..

    రూ. 2.00 కోట్లకు సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్..

    కన్నడ సినీ పరిశ్రమలో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమాన 'కాంతార'. ఈ చిత్రాన్ని హొంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ఇందులో ప్రమోద్ శెట్టి, కిశోర్, అచ్యుత్, సప్తమి గౌడలు కీలక పాత్రలను పోషించగా.. అంజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రం ముందుగా కన్నడలో విడుదలైనా తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు. కర్ణాటకలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదలై బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న 'కాంతార'ను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని భావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు రూ. 2.00 కోట్లకు గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుని.. ఏపీ, తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసింది.

    కేవలం 13 రోజుల్లోనే..

    కేవలం 13 రోజుల్లోనే..

    ఇక తెలుగులో కాంతార విడుదలైనప్పటినుంచి సూపర్ మౌత్ టాక్ తోపాటు కలెక్షన్లలో దూసుకుపోతోంది. దేశం మొత్తం చర్చించుకునేలా చేసిన ఈ కాంతార మూవీ 13 రోజుల్లో కేవలం తెలుగులో రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియాతోపాటు మిగిలిన దేశాల్లో మొత్తం కలుపుకుని కాంతార తెలుగు వెర్షన్ ఈ మొత్తాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరికొన్ని రోజుల్లో రూ. 50 కోట్లు క్లబ్ లో చేరే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే కాంతార ఒరిజినల్ వెర్షన్ కన్నడ కాకుండా మిగిలిన మూడు డబ్బింగ్ వెర్షన్లు (తెలుగు, హిందీ, తమిళం) ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

    సుమారు 10 రెట్ల లాభం..

    సుమారు 10 రెట్ల లాభం..

    ఇక అమెరికాలో అయితే కన్నడ వెర్షన్ కన్నా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కే ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. సోమ, మంగళ, బుధవారాల్లో కాంతార తెలుగు వెర్షన్ 419, 444 డాలర్లు వసూలు చేయగా, కన్నడ వెర్షన్ 14, 848 డాలర్లు కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే తెలుగు ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సుమారు రూ. 2 కోట్లకు తెలుగు థియేట్రికల్ రైట్స్ ను అరవింద్ కొనుగోలు చేయగా రూ. 2.30 కోట్లగా బ్రేక్ ఈవెన్ నమోదు అయింది. అయితే ఇప్పటికే రూ. 24 కోట్ల మేర షేర్ వచ్చింది. అంటే సుమారు 10 రెట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది.

    English summary
    Rishab Shetty Starrer Kannada Movie Kantara Telugu Dubbed Version Collects Rs 45 Cr In Only 13 Days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X