»   » 29 రోజులకు'రోబో' (తెలుగు) కలెక్షన్ రూ. 60 కోట్లు

29 రోజులకు'రోబో' (తెలుగు) కలెక్షన్ రూ. 60 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే, ఈ సందర్భంగా తెలుగు రైట్స్ తీసుకున్న తోట కన్నారావు తన సొంత గ్రామం యర్నగూడెం(పశ్చమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...రోబో తెలుగు సినిమా 29 రోజులకు రాష్టవ్య్రాప్తంగా రూ..60 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. అలాగే రోబో కొనుగోలుకు ముందు తన భార్య వెంకటరమణతో సంప్రదించి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ సినిమా తనకు పేరుతోపాటు మంచి లాభాలు తెచ్చి పెడుతున్నట్టు చెప్పారు. రూ. 100 కోట్ల వరకు వసూలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సాయిబాబా ఆలయ నిర్మాణానికి తన భార్య వెంకటరమణ కోరిక మేరకు రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సొమ్ముతో ఆలయ నిర్మాణం పూర్తి చేసి, జమా ఖర్చులను తెలపాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. ఇక రోబో చిత్రాన్ని అంత పెద్ద మొత్తానికి ఎవరూ కొనటానికి ముందుకు రాకపోతే కన్నారావు ధైర్యం చేసి 27 కోట్లకు కొనుగోలు చేసారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu