twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్దిరిపోయే రేంజిలో 'రోబో' నైజాం రైట్స్

    By Srikanya
    |

    'రోబో' నైజాం ప్రదర్శన హక్కులును జెమిని ఫిల్మ్స్ 8.80 కోట్లు చెల్లించి సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఓ డబ్బింగ్ చిత్రానికి ఈ రేటు పలకటం ఇప్పటివరకూ జరగలేదు. ఇక ఈ రైట్స్ విషయమై దాసరి నారాయణరావు సంస్థ సిరిమీడియా కు జెమిని ఫిల్మ్స్ కు మద్య గట్టి పోటి నడిచింది. కాని చివరకు జెమిని ఫిల్మ్స్ భారీమొత్తానికి నైజాం ప్రదర్శన హక్కులు కైవసం చేసుకుంది. ఇక కళానిధి మారన్‌ తమిళంలో నిర్మిచిన ఈ చిత్రం బడ్టెట్..రూ.180 కోట్లు. ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింన ఈ చిత్రం తమిళ్, హిందీల్లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 1న 2,250 ప్రింట్లతో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి తెలుగు ప్రదర్శన హక్కులు కృష్ణ ట్రేడర్స్ అధినేత తోట కన్నారావు 27 కోట్లకు సొంతం చేసుకున్నారు. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా చేసిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, కెమెరా: ఆర్.రత్నవేలు, కళ: సాబు సిరిల్, సౌండ్ ఎఫెక్ట్స్: రసూల్ పూకుట్టి, నిర్మాత: కళానిధి మారన్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శంకర్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X