‘రొమాన్స్’ కలెక్షన్స్ పరిస్ధితి ఏంటి?
హైదరాబాద్ :ఈరోజుల్లో' టీమ్ రూపొందించిన తాజా సినిమా 'రొమాన్స్'. 'ఎవ్వెరిబడి నీడ్స్' అనేది ఉపశీర్షిక. ప్రిన్స్ హీరో. డింపుల్, మానస హీరోయిన్స్. 'డార్లింగ్' స్వామి దర్శకుడు. మారుతి సమర్పణలో గుడ్ సినిమా గ్రూప్-మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా నిర్మించాయి. జి.శ్రీనివాసరావు-ఎస్.కె.ఎన్ నిర్మించారు. ఇటీవల చిత్రం రిలీజ్ చేశారు. చిత్రం మరీ నాశిరకంగా ఉండటంతో మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపినింగ్స్ తెచ్చుకోకపోయినా వీకెండ్ లో కలెక్షన్స్ బాగానే సంపాదించింది.
ఇక ఈ చిత్రం నైజాం రైట్స్ ని రవితేజ తో కృష్ణ చిత్రం తీసిన కాశి విశ్వనాధం ...ఎనభై లక్షలు చెల్లించి తీసుకున్నారు. ఆయన ఈ చిత్రం కలెక్షన్స్ తో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలియచేసారు. మొదటి మూడు రోజుల్లోనే తమ షేర్ 80 లక్షలు వెనక్కి తీసుకు వ్చిచందని అన్నారు. అలాగే ఈ చిత్రం ఇలాగే రన్ అయితే కోటి డభై లక్షలు వరకూ వసూలు చేస్తుందని నమ్మకం వెల్లబుచ్చారు. యూనిట్ కష్టపడి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతోందని అన్నారు.
నైజాం విషయం ప్రక్కన పెడితే.. మిగతా ఏరియాల్లో ఎక్కడా చెప్పుకోతగ్గ కలెక్షన్స్ ఈ చిత్రానికి లేవని తెలుస్తోంది. బంద్ ప్రభావం కూడా ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ కు కారణమని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే సినిమాలో విషయం లేకపోవటమే ఎవరినీ ఎట్రాక్ట్ చేయకపోవటానికి కారణమని ఇండస్ట్రీ పీపుల్ అంటున్నారు. ఇక ఈ చిత్రం రెండు కోట్ల బడ్జెట్ లో నిర్మితమైంది. హైదరాబాద్ లోనే 54 థియోటర్స్ లో ఈ చిత్రం భారిగా విడుదలైంది. అలాగే...ఈ చిత్రానికి మారుతి చాలా ఎగ్రిసివ్ గా ప్రమేషన్ చేసారు.


Click it and Unblock the Notifications












