Don't Miss!
- News
డీఎంకే ప్రభుత్వ పెద్దలతో ఏపీ మంత్రులు- చెన్నైలో కీలక భేటీ..!!
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Sports
పెళ్లితో ఒక్కటయ్యాం.. ఆశీర్వదించండి: కేఎల్ రాహుల్
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
2022లో ఇండియన్ బాక్సాఫీస్‌కు ప్రాణం పోసిన చిత్రాలు ఇవే.. RRR, KGF2 వసూళ్ల షేర్ ఎంతంటే?
గత రెండు, మూడు ఏళ్లుగా భారతీయ సినిమా పరిశ్రమ అనిశ్చితికి గురైంది. కరోనావైరస్ కారణంగా సినిమా థియేటర్ల మూసివేతతో సినీ పరిశ్రమ కుదేలయ్యింది. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో గత రెండేళ్లుగా ఆగిపోయిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తడబాటుకు లోనైతే.. నాలుగైదు సినిమాలు కలెక్షన్లతో హోరెత్తించాయి. 2022 సంవత్సరంలో సగం ముగిసి నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన సినిమాల వివరాలు ఇవే..
ప్రస్తుతం ఏడాదిలో ఫిబ్రవరిలో ఆలియా భట్ నటించిన గుంగూభాయ్ కతియావాడి థియేటర్ల రిలీజ్ కావడం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ది కశ్మీర్ ఫైల్స్, భూల్ భులయ్యా 2, RRR, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా వసూళ్ల సునామీని సృష్టించాయి.

అందరి అంచనాలను మించి ది కశ్మీరి ఫైల్స్ చిత్రం రూ.252.9 కోట్లు వసూలు చేసింది. కార్తీక్, ఆర్యన్ నటించిన భూల్ బులయ్యా 184.32 కోట్లు రాబట్టింది. గంగూభాయ్ కతియావాడి 130 కోట్లు, RRR హిందీ వెర్షన్ 274 కోట్లు, కేజీఎఫ్ చాప్టర్ 2 హిందీ వెర్షన్ 434.7 కోట్లు రాబట్టింది.
అయితే ఈ సినిమాల విజయాలపై ట్రేడ్ అనలిస్టులు స్పందిస్తూ.. కరోనాకు ముందు దేశీయ బాక్సాఫీస్ వద్ద ఆరు నెలల్లో 2300 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. కరోనా పరిస్థితుల తర్వాత 2 వేల కోట్లు రాబట్టింది. అయితే కొంత తగ్గిన మాట వాస్తవమే కానీ.. ఆ స్థాయికి తగినట్టుగా వసూళ్లు రాబట్టడం కొంత ఉపశమనమే అని అంటున్నారు.
అయితే 2 వేల కోట్ల వసూళ్లలో RRR, KGF Chapter 2 చిత్రాలే 1000 కోట్లు సంపాదించాయి. మిగితా చిత్రాలు మరో 1000 కోట్లు వసూలు చేశాయి. రాజ్ కుమార్ రావు బదాయి హో, అక్షయ్ కుమార్ బచ్చన పాండే, రణ్‌వీర్ సింగ్ జయేష్ భాయ్ జోర్దార్, కంగన రనౌత్ దాకడ్ చిత్రాలు దారుణమైన వసూళ్లను సాధించాయి అని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.