»   » తమిళనాట పులిని తినేస్తున్న 'రుద్రమదేవి'

తమిళనాట పులిని తినేస్తున్న 'రుద్రమదేవి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేసింది ‘రుద్రమదేవి' టీమ్ . ఈ చిత్రం టాక్ యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం అదరొకొట్టాయి. ఈ నాలుగు రోజులు కలెక్షన్స్ ఆంధ్రా,తెలంగాణాలలో బాగున్నాయి. ఇక ఇప్పుడు తమిళంలోనూ ఈ చిత్రం విడుదల అయ్యి...అక్కడ ప్రేక్షకులను అలరించబోతోంది.

మొన్న శుక్రవారమే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ థియోటర్స్ సమస్యతో రిలీజ్ కాలేదు. అయితే ప్రస్తుతం నిర్మాతలు అక్టోబర్ 16న నాలుగు వందలు థియోటర్స్ లో టుడి, త్రీడి వెర్షన్స్ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. పులి చిత్రం ఉన్న థియోటర్స్ ని ఇది ఆక్రమించనుందని తెలుస్తోంది. అలాగే యుఎస్ లో తమిళ వెర్షన్ ...అక్టోబర్ 23న విడుదల అవుతుంది.


చిత్రం కథేమిటంటే...


Rudrama Devi Tamil Big Release on 16th

రుద్రమదేవి(అనుష్క) పుట్టేటప్పడికి కాకతీయ సామ్రాజ్య పరిస్దితులు బాగోలేవు... ఓ ప్రక్క దాయాదుల నుంచి, మరో ప్రక్క శత్రువుల నుంచి రాజ్యానికి ముప్పు ఉంది. మగపిల్లవాడు పుడితే తమ వారసుడుగా ఏలుతాడు అనుకుంటే పుట్టింది ఆడపిల్ల అని తెలిసి రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు) నిరాశపడతాడు. వారసుడు లేడు అని తెలిస్తే వెంటనే వారంతా దండెత్తే అవకాసం ఉందని ఏం చేయాలో అని ఆలోచనలో పడితే అప్పుడు ఆయన మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) ఓ సలహా ఇస్తాడు.


బయిట ప్రపంచానికి తెలియకుండా ఆమెను మగపిల్లాడిలా నమ్మిస్తూ పెంచమంటాడు. ఆ క్రమంలో ఓ కొడుకులాగ రుద్రమదేవిని పెంచుతాడు. ఆమె పెరిగి పెద్దయ్యాక వివాహం సైతం ముక్తాంబ(నిత్యామీనన్ )ని ఇచ్చి చేస్తారు. ఇదే సమయంలో బందిపోటు గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్) రుద్రమదేవితో పోరుకు సై అంటాడు. అప్పుడు ఏం జరిగింది...రుద్రమదేవి...మగపిల్లాడు కాదు...స్త్రీ అనే విషయం ఎలా రివీల్ అయ్యింది. ఆమెను ప్రేమించిన వీరభధ్రుడు (దగ్గుపాటి రానా) ఏం చేసి ఆమెను పొందాడు...రుద్రమదేవి తన ముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొని వీర నారి అయ్యింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

English summary
Now makers are in plans to release Rudrama Devi Tamil version on Oct 16th in 400 screens across Tamil Nadu in both 3D and 2D. It also heard that Puli being replaced in several theaters in Tamil Nadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu