»   » మహేష్, పవన్ తర్వాత బన్నీ మూడో స్థానంలో...

మహేష్, పవన్ తర్వాత బన్నీ మూడో స్థానంలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ బన్నీ హీరోగా తెరకెక్కిన 'S/O సత్యమూర్తి' సినిమాపై ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా రాజేంద్రప్రసాద్, కోట, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం, అలీ లాంటి ప్రముఖులు ఉండటం, యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ అనే పేరు రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసారు.

ఓపెనింగ్స్ విషయంలో గత రికార్డులను బద్దలు కొట్టి ఈ చిత్రం నెం.1 స్థానానికి చేరుతుందని అంతా భావించారు. అయితే బాక్సాఫీసు వద్ద ఈ చిత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఎ' సెంటర్లలో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించినా...‘బి, సి' సెంటర్లలో మాత్రం సాధారణ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి.


S/o Satyamurthy 1st day collections

అయితే సినిమా కలెక్షన్స్ తొలి రోజు ఏపీ-తెలంగాణ షేర్ అల్లు అర్జున్ కెరీర్లో హయ్యెస్ట్ అని అంటున్నారు. దాదాపు రూ. 9.3 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. మరో వైపు ఈ చిత్రం యూఎస్ఏ ప్రీమియర్ షో 157లో ప్రదర్శించారు.


ప్రీమియర్ షో ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటికీ మహేష్ బాబు నటించిన ఆగడు $523000 వసూలు చేసి టాపులో ఉంది. ఆ తర్వాతి స్థానంలో అత్తారింటికి దారేది $345000 ఉంది. $338000 వసూలు చేసిన 'S/O సత్యమూర్తి' మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తర్వాతి స్థానాల్లో గోపాల గోపాల, టెంపర్, బాద్ షా, 1 నేనొక్కడినే చిత్రాలు ఉన్నాయి.

English summary
S/o Satyamurthy started with a mixed opening trend at the Box-office today. As per the early predictions the film is set to collect around 8.5 Cr AP/N SHARE on Day1 which will be Allu Arjun`s career best figure .
Please Wait while comments are loading...