»   » గోపీచంద్ ‘జిల్’ ఒత్తిడి...‘s/o సత్యమూర్తి’ వాయిదా?

గోపీచంద్ ‘జిల్’ ఒత్తిడి...‘s/o సత్యమూర్తి’ వాయిదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాన్ని వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మరో వారం లేటుగా విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం గోపీచంద్ నటించిన ‘జిల్'చిత్రం ఈ నెల 27న విడుదల కావడమే అని టాక్.

‘జిల్' చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లలో చాలా మంది ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాన్ని కూడా కొనుగోలు చేసారట. మధ్యలో (మార్చి 31, ఏప్రిల్ 1) బ్యాంకు హాలిడేస్ ఉండటంతో మనీ అడ్జెస్ట్‌మెంట్ కష్టం అవుతుందని గొడవ పెడుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం వారం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

‘జిల్' చిత్రం విషయానికొస్తే...
మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం జిల్. లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నగోపిచంద్ హీరోగా నటించగా రాశిఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జిల్ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

 S/O Satyamurthy makers to postpone the film

ఇటీవలే ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరై విడుదల చేసిన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు, అభినయం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.

నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను, కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్, ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్.ప్రకాష్, యాక్షన్ డైరెక్టర్ - అనిల్ అరసు, ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి - శక్తి శరవణన్, మ్యూజిక్ - జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్.

English summary
Most awaited movie of the season, S/O Satyamurthy release is likely to be pushed by a week as per the buzz from tinsel town. SOS was actually planned for April 2nd release, but few external factors are exerting pressure over the makers to postpone the film. As March 31st and April 1st are Bank Holidays, many distributors will find it tough to clear the balance amount if the movie comes on April 2nd.
Please Wait while comments are loading...