»   » అత్యాసే..: 'సన్నాఫ్ సత్యమూర్తి' కి నష్టం తెచ్చింది...లాస్ ఎంతంటే

అత్యాసే..: 'సన్నాఫ్ సత్యమూర్తి' కి నష్టం తెచ్చింది...లాస్ ఎంతంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం భాక్సాఫీస్ వద్ద రేర్ ఫీట్ చేసి,కలెక్షన్స్ బాగానే రప్పించుకున్న సంగతి తెలిసిందే. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ మాత్రం ఎక్కడా వెనకడుగువెయ్యక ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ చూస్తే 51.9 కోట్లు సాధించింది. అప్పటిదాకా బాగానే ఉంది... అయితే ఈ మొత్తం లాసే అంటున్నారు. దాదాపు రెండున్నర కోట్లు వరకూ నష్టం తెప్పించి ఒడ్డున పడిందని చెప్తున్నారు. రేసు గుర్రం కలెక్షన్స్ చూసి దాంతో పోల్చి ఈ ఫ్యామిలీ సినిమాని ఎక్కువ రేట్లకు కొనటమే దెబ్బ కొట్టిందని చెప్పుకుంటున్నారు. లేకపోతే అందరూ సేఫ్ గా ఓ రూపాయ తినేవారు అని చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రం థియోటర్ రైట్స్ ని 54 కోట్లకు అమ్మటం జరిగింది. దాంతో వచ్చిన షేర్ 51.9 కోట్లు ఉంది. మధ్యలో రెండు కోట్లు వరకూ నష్టం కనపడింది. అయితే ఇది మొత్తం మీద కాబట్టి ఒకరికే ఈ నష్టం కనపడలేదని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. సినిమా బాగానే కలెక్టు చేసినా, ఎక్కువ రేట్లు కు అమ్మటంతో ఈ దెబ్బ తగిలిందని అంటున్నారు. అయితే ఇలాంటి సిట్యువేషన్ లో నూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ కలెక్షన్ లో ఈ చిత్రం ఏడవ ప్లేస్ ని ఆక్రమించింది.


 S/o Satyamurthy: Resulted In 2.5 Crores Loss?

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుసత్యమూర్తి ప్రపంచవ్యాప్త మొత్తం కలెక్షన్స్ :రూ 51.9కోట్లు( కర్ణాటక:రూ 5.80కోట్లు;తమిళనాడు:రూ 0.63కోట్లు; బారత్ లో మిగతా ప్రాంతాలు:రూ 0.72కోట్లు; ఓవర్ సీస్:రూ 5.95కోట్లు; కేరళ:రూ 1.15కోట్లు)


'రేసు గుర్రం' తర్వాత అల్లు అర్జున్, 'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'. అంతేకాదు.... 'జులాయి' సినిమా తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే. ఈ స్దాయిలో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన ఈ చిత్రం ఆ రేంజిని అందుకోకపోయినా ...పెట్టిన పెట్టుబడిని సంపాదించి, అల్లు అర్జున్ స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసింది.

English summary
Talking about profit and loss for distributors, S/o Satyamurthy's theatrical rights are valued at nearly 54 crores. That means, some distributors would have faced slight deficits and that slight 'figure' is nearly 2.5 crores.
Please Wait while comments are loading...