For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చేతులు కాలాక ఆకుల పట్టుకున్నట్లుగా...సాయిధరమ్‌తేజ్‌ ‘తిక్క’ ని

  By Srikanya
  |

  హైదరాబాద్‌: ఎంత పెద్ద హీరో సినిమాకు అయినా ఫ్లాఫ్ టాక్ వచ్చిందంటే దానికి నిండు నూరు రోజులు నిండినట్లే. ఎందుకంటే మార్నింగ్ షో టాక్ పైనే తర్వాత షో ల కలెక్షన్స్ ఆధారపడి ఉంటున్నాయి. అంత స్పీడ్ గా టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఆ టాక్... హిట్ సినిమాకు ఓ రేంజిలో ప్లస్ అయ్యి, పెళ్లి చూపులు లాంటి సక్సెస్ కు దారితీస్తే, ఫ్లాఫ్ సినిమాని బ్రహ్మోత్సవం స్దాయిలో డిజాస్టర్ చేసేస్తున్నాయి.

  తాజాగా 'సుప్రీమ్‌' సక్సెస్ తో మంచి వూపుమీదున్న మెగా హీరో సాయిధరమ్‌తేజ్‌ నటించిన తాజా చిత్రం 'తిక్క కు అలాంటి సమస్య ఎదురైంది. శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్‌ పతాకంపై రోహిణ్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సునీల్‌రెడ్డి దర్శకత్వం వహించారు. మొన్న శుక్రవారం( ఈ నెల 13న )విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

  మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ...ప్రేక్షకులు, అభిమానుల నుంచి వచ్చిన సూచనలపై స్పందించిన చిత్ర యూనిట్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 'తిక్క' చిత్ర నిడివిని 10 నిమిషాలు తగ్గించింది.

  Sai Dharam Tej’s Thikka trimmed

  భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. లరిస్సా బోన్సి, మన్నారా చోప్రా, రాజేంద్ర ప్రసాద్‌, ముమైత్‌ఖాన్‌, అలీ, అజయ్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

  తిక్క కథేమిటంటే...ఆదిత్య (సాయిధరమ్‌ తేజ్‌) మందు,మగువ లైఫ్ అని ఓ జల్సారాయుడు. అలాంటి ఈ కుర్రాడు ఓ రోజు అంజలి (లరిస్సా బోన్సి) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సైట్ కొట్టి,కొట్టి,ఆమెను ఒప్పిస్తాడు. అంతేకాకుండా ఆమె కోసం తనను తాను మార్చుకుంటాడు. కానీ ఓ రోజు ఆమె హఠాత్తుగా కొన్నిసిల్లీ రీజన్స్ సాకుగా చూపించి బ్రేకప్‌ చెప్పి బై అంటుంది అంజలి.

  వెళ్తూ.. వెళ్తూ ఓ ఉత్తరం ఆదిత్య జేబులో పెట్టి వెళుతుంది. అంజలి దూరమైందన్న బాధతో ఫ్రెండ్స్ తో కలసి తెగ తాగేస్తాడు ఆదిత్య. ఆ హ్యాగోవర్ లో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు వల్ల మొత్తం మారిపోతుంది. రకరకాల కన్ఫూజన్స్ ఏర్పడతాయి.ఆ కన్ఫూజన్స్ ఏమిటి? అంజలి బ్రేకప్ కి అసలు రీజన్ ఏమిటి? అసలా లెటర్ లో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్, ఆ సక్సెస్ ట్రాక్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో 'తిక్క' అనే మరో కామెడీతో ఈ రోజు వచ్చాడు. ఆ చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో నష్ట నివారణా చర్యలు మొదలెట్టారు నిర్మాతలు.

  English summary
  Sai Dharam Tej’s Thikka hit the screens friday to mixed reviews . After listening to the word-of-mouth, the makers trim the film by 10 minutes to make it racy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X