»   » ‘విన్నర్’:కలెక్షన్స్ పరిస్దితి ఏంటి..అక్కడ మరీ దారుణమా? ఎంత నష్టపోతారు?

‘విన్నర్’:కలెక్షన్స్ పరిస్దితి ఏంటి..అక్కడ మరీ దారుణమా? ఎంత నష్టపోతారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. శివరాత్రి పురస్కరించుకుని సినిమా శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది.

ఈ చిత్రం మొదటి రోజు భాక్సాఫీస్ వద్ద ఓపినింగ్స్ అదరకొట్టాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అలాగే ..ప్రపంచ వ్యాప్తంగా 6.25 కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఊహించని విధంగా రెండో రోజు ... డ్రాప్ కనపడటం అందరినీ కలవపెట్టే అంశమైంది. 2.29 కోట్లు షేర్ రెండో రుజు వచ్చింది. అయితే ఈ షేర్ మరీ అంత తక్కువేమీ కాదు. అయితే ఈ రోజు అంటే ఆదివారం ... ఆంధ్రా , తెలంగాణా షేర్ ..ఖచ్చితంగా పది కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.


ఈ చిత్రం 25 కోట్లకు ప్రి రిలీజ్ ధియోటర్ బిజినెస్ జరిగింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 27 కోట్లు వస్తే రికవరీ అవుతుంది. ముఖ్యంగా సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలు కానుంది.


Sai Dharma Tej's Winner Day 2 Report

విన్నర్ రెండు రోజుల కలెక్షన్స్ (షేర్):


నైజాం: రూ 2.62 కోట్లు


సీడెడ్: రూ 1.38 కోట్లు


ఉత్తరాంధ్ర: రూ 92.58 కోట్లు


గుంటూరు: రూ రూ 68.03 లక్షలు


కృష్ణా: రూ 46.83 లక్షలు


ఈస్ట్ గోదావరి: రూ 88.95 లక్షలు


వెస్ట్ గోదావరి: రూ 65.00 లక్షలు


నెల్లూరు: రూ 26.96 లక్షలు


విన్నర్ రెండు రోజులు ఎపి & నైజాం కలెక్షన్స్ : రూ 7.89 కోట్లు


అయితే అమెరికాలో మాత్రం పరిస్థితి బాగా తేడాగా కనిపిస్తోంది. అక్కడ ఇప్పటివరకు కేవలం 18 వేల డాలర్లు మాత్రం వసూలవటంతో ఆందోళనకరంగామారింది. ఇక తెలుగు రాష్ట్రంలలో విన్నర్ సినిమాను 23 కోట్లు రూపాయలు వెచ్చించి కొనగా.. ఓ 7-10 కోట్లు లాస్ తప్పేలా లేదని పరిస్థితిని అంచనా వేస్తున్నారు . అదే అమెరికాలో అయితే 1.2 కోట్లు పెట్టి కొన్నారు కాబట్టి.. కలక్షన్లు ఇలాగే ఉంటే మాత్రం ప్రింట్ ఖర్చులు కూడా రికవర్ అవ్వని పరిస్థితి వస్తుందంటున్నారు.


Sai Dharma Tej's Winner Day 2 Report

దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా మొదటి భాగం మొత్తాన్ని కామెడీ, యాక్షన్ బేస్ చేసుకుని హిట్ కొట్టాలని ప్లాన్ చేసారు. అయితే సినిమా మొత్తం రొటీన్ గా సాగింది. ఫస్టాఫ్ అంతా ఫన్ తో నడిపేసారు కానీ సెంకండాఫ్ కు వచ్చేసరికి చతికిలి పడింది.


ముఖ్యంగా పద్మ పాత్రలో వెన్నెల కిషోర్, సింగం సుజాత పాత్రలో పృధ్వితో కామెడీ పండించడంతో పాటు తీన్మార్ న్యూస్ ద్వారా పాపులర్ అయిన బిత్తిరి సత్తితో కూడా కామెడీ చేయించి ఫస్టాఫ్ లాగించేసారు. ఎప్పటిలాగే పృధ్వి తనదైన మేనరిజంతో 'సింగం సుజాత' పాత్రలో ఎంట్రీ ఇచ్చి నవ్వించాడు. సింహాన్ని అడవిలో, జూలో, యూట్యూబ్ లో చూసుంటారు కానీ యూనిఫాంలో చూసుండరు అంటూ పృథ్వి తనదైన డైలాగ్ డెలివరీతో నవ్వించారు.


ఫస్టాఫ్ ఎలాగోలా గడిపేసానా...సెకండాఫ్ బోర్ కొట్టేసిందని చెప్తున్నారు. మొత్తానికి 'విన్నర్' మూవీపై ఫస్ట్ షోకే జస్ట్ యావరేజ్, రొటీన్ సినిమా అనే టాక్ స్ప్రెడ్ అయింది. క్లైమాక్స్ కు హార్స్ రేస్ సీన్స్ బాగా డిజైన్ చేసారు. కానీ ప్రీ క్లైమాక్స్ లో జగపతిబాబు, సాయి ధరమ్ తేజ మధ్య వచ్చే సీన్స్ మాత్రం బాగా పూర్ గా ఎగ్జిక్యూట్ చేసారు.


సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల‌ కిశోర్ త‌దిత‌రులుఇతర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: త‌మ‌న్‌, ఆర్ట్: ప్ర‌కాష్‌, క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌,మాట‌లు: అబ్బూరి ర‌వి, నృత్యాలు: రాజు సుంద‌రం, శేఖ‌ర్‌, ఫైట్స్: స్ట‌న్ శివ‌, ర‌వివ‌ర్మ‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్ రాజు, స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్వం:గోపీచంద్ మ‌లినేని.

English summary
On Day 2, There is a dip in 'Winner' revenue . However, A Share of Rs 2.29 crore on Second Day in Telugu States
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu