»   » ప్రేమ పరవళ్లు ('తుంగభద్ర' ప్రివ్యూ)

ప్రేమ పరవళ్లు ('తుంగభద్ర' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గ్రామీణ నేపధ్యంలో జరిగే ప్రేమ కథలు తెలుగు తెరపై బాగా తక్కువయ్యాయి. ఆ లోటుని పూరించటానికా అన్నట్లు ఈ రోజు తుంగభద్ర చిత్రం వస్తోంది. అక్కడ రాజకీయాలు, మధ్యలో నలిగే ఓ ప్రేమ కథ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం ఇది. గతంలో సాయి కొర్రిపాటి నిర్మించిన చిత్రాలు ప్రత్యేకమైన అభిరుచితో కుటుంబాలను ఆకట్టుకునేలా ఉండటంతో ఈ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్స్, పోస్టర్స్ సినీ అభిమానుల్లో మంచి క్రేజ్ ని క్రియేట్ చేసాయి. దాంతో మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. చాలాకాలం క్రితం ప్రారంభమై నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం అదే స్ధాయిలో ఆడాలని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. సంగీతం, రీరికార్డింగ్‌, లొకేషన్స్‌, సినిమాటోగ్రఫీ, నటీనటులు ఈ సినిమాకు పెద్ద హైలైట్‌.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ సినిమాలో సెల్‌ఫోన్లు పెద్దగా కనిపించవు. అలాగని ఏ పీరియడ్‌కి చెందిన సినిమా అన్నది స్పష్టంగా చెప్పలేదు. కథకు సెల్‌ఫోన్లు అడ్డు రాకూడదని ఆ నియమాన్ని పాటించారు. ‘తుంగభద్ర' నదికిగానీ, ఆ ప్రాంతానికిగానీ సంబంధించిన కథ కాదు. తుంగ, భద్ర అనే రెండు నదులు కలిసినా అక్కడి ప్రజలు కలవరు అనేదే కాన్సెప్ట్‌. లోకల్‌ పాలిటిక్స్‌కి కీలక పాత్ర ఉంటుంది.


Sai Korripati's Tungabadra Movie preview

ఇందులో హీరో గుబురు గడ్డంతో కాస్త రఫ్‌గా కనిపిస్తాడు. ఏ పనీపాటా లేకుండా పార్టీల చుట్టూ తిరిగే యువకుడి పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం బరువు కూడా పెరిగాడు. గుంటూరు పరిసరాల్లో దాదాపు మూడు నెలలు షూటింగ్‌ చేశారు. అర్థవంతమైన క్లైమాక్స్‌ ఉంటుంది. ఈ ఉగాదికి వస్తున్న స్వచ్ఛమైన తెలుగు చిత్రమిది అని చెప్తున్నారు.


సాయి కొర్రపాటి శ్రీనివాస్ కృష్ణ గోగినేనిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా ఇది. ఈ మూవీ ద్వారా అదిత్ హీరోగా పరిచయం అవుతుంటే ‘రొమాన్స్' ఫేం డింపుల్ చోపడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమిళ యాక్టర్ సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి హరి గౌర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆడియోతో పాటు ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.''తుంగ, భద్ర అనే రెండు నదులు కలిసి తుంగభద్ర అయింది. కానీ ఆ నదుల పక్కన ఉన్న ఓ వూళ్లోని మనుషులు మాత్రం కలవరు. అలాంటి రెండు వర్గాల మధ్య నలిగిన ఓ ప్రేమజంట కథే ఈ 'తుంగభద్ర' చిత్రం. ఇందులో రాజకీయాల ప్రస్తావనా ఉంటుంది. పార్టీలు ఎక్కడో ఉంటాయి. కానీ వాటి కోసం ఇక్కడ మనుషులు కొట్టుకుంటుంటారు. ఇందులో హీరో కొర్లపూడి శీను అనే కుర్రాడిగా కనిపిస్తారు. వూళ్లో రాజకీయ వాతావరణం అతన్ని ఎలా ప్రభావితం చేసిందన్నది ఆసక్తికరం. గుంటూరు నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో సహజత్వం అందరినీ అలరిస్తుంది''.


చిత్రం గురించి హీరో ఆదిత్ మాట్లాడుతూ... ''నచ్చిన సినిమాలు నాకు రాలేదు. వచ్చిన సినిమాలు నాకు నచ్చలేదు. ఇప్పుడిప్పుడే నా పనితీరు నన్ను సంతృప్తి పరుస్తోంది. ఒక నటుడిగా నాలో పరిణతి పెరిగిందనిపిస్తోంది. అందుకే ఇదే నా తొలి చిత్రంగా భావిస్తున్నా'' అంటున్నారు ఆదిత్‌.


అలాగే... ''పాత్ర రీత్యా ఇందులో మాస్‌ లుక్‌తో కనిపించాల్సి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే శరీరాకృతి మార్చుకున్నా. గడ్డం పెంచి నటించా. ఈ లుక్‌ ఇక్కడ నాకు కొత్తగానే అనిపిస్తుంది కానీ... తమిళంలో 'తేనీరు విడిది' అనే చిత్రంలో ఇలాగే కనిపించా. ఇలాంటి పాత్రలను అర్థం చేసుకొని నటించడంలోనే ఉంటుంది అసలు పనితనం. ఇందులో నా నటన నాకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది.'' అని చెప్పుకొచ్చారు.


బ్యానర్: వారాహి చలన చిత్ర నిర్మాణ సంస్థ అధినేత
అదిత్, డింపుల్, సత్యరాజ్‌, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, సప్తగిరి, రాజేశ్వరి నాయర్‌, ధన్‌రాజ్‌, నవీన్‌, రవివర్మ, చరణ్‌, శశాంక్‌ తదితరులు
సంగీతం: హారి గౌర,
ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాత్సవ్‌,
ఫైట్స్‌: నందు,
నిర్మాత: రజని కొర్రపాటి,
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని.
సమర్పకుడు: సాయి కొర్రపాటి
విడుదల తేదీ: మార్చి 20,2015.

English summary
Tungabhadra’, a village-based love story directed by newcomer Srinivasa Krishna Gogineni is gearing up for a release today( March 20). Adith Arun , who sizzled in movies – “Katha” and “Weekend Love” with lover boy image, is in all new style with thick intense looks in “Tungabhadra”. The movie features actress Dimple Chopade in a lead role opposite Adith. Tamil actor Satya Raj will also be seen in an important role in the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu