twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీసును కుమ్మేసిన సల్మాన్ ఖాన్: ‘భారత్’ ఫస్ట్ డే వసూళ్ల సునామీ!

    |

    ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన అభిమానులకు సూపర్ హిట్ సినిమాను అందిస్తాడు. 2019లో కూడా మళ్లీ అది రిపీటైంది. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ రూపొందించిన 'భారత్' చిత్రం బుధవారం విడుదలై సల్మాన్ ఖాన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

    'భారత్'పై రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగిన విధంగానే ఇండియా వ్యాప్తంగా 4700 స్క్రీన్లలో విడుదల చేశారు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం రూ. 42.3 కోట్లు వసూలు చేసింది.

    మరోసారి ప్రూవ్ చేసిన సల్మాన్ ఖాన్

    మరోసారి ప్రూవ్ చేసిన సల్మాన్ ఖాన్

    ఇండియన్ హీరోల్లో సల్మాన్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని రుజువైంది. తన సినిమా స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేశాడు. గతంలో సల్మాన్ ఖాన్-అలీ అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో టైగర్ జిందాహై(రూ.34.10 కోట్లు), సుల్తాన్ (రూ. 36.54 కోట్లు) చిత్రాలు వచ్చాయి. అయితే బుధవారం రిలీజైనప్పటికీ భారత్ రూ. 42.3 కోట్లు వసూలు చేసి ఆరెండు చిత్రాలను అధిగమించింది.

    2019లో నెం.1 ఇదే..

    2019లో నెం.1 ఇదే..

    2019లో విడుదలైన బాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన టాప్ 5 చిత్రాల్లో ‘భారత్' నెం.1 స్థానం దక్కించుకుంది.

    1. భారత్ రూ. 42.30 కోట్లు (బుధవారం రిలీజ్)
    2. కలంక్ రూ. 21.60 కోట్లు (బుధవారం రిలీజ్)
    3. కేసరి రూ. 21.06 కోట్లు (గురువారం రిలీజ్)
    4. గల్లీబాయ్ రూ. 19.40 కోట్లు(గురువారం రిలీజ్)
    5. టోటల్ ధమాల్ రూ. 16.50 కోట్లు (శుక్రవారం రిలీజ్)

    సల్మాన్ ఖాన్ ఈద్ రిలీజ్ వసూళ్లు

    సల్మాన్ ఖాన్ ఈద్ రిలీజ్ వసూళ్లు

    సల్మాన్ ఖాన్ 2010 నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ప్రతి ఈద్ ఫెస్టివల్ సందర్భంగా ఒక సినిమా విడుదల చేస్తున్నారు. వాటి వాసూల్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    2010: దబాంగ్ ₹ 14.50 కోట్లు
    2011: బాడీగార్డ్: ₹ 21.60 కోట్లు
    2012: ఏక్ థా టైగర్ ₹ 32.93 కోట్లు
    2014: కిక్ ₹ 26.40 కోట్లు
    2015: బజరంగీ భాయిజాన్ ₹ 27.25 కోట్లు
    2016: సుల్తాన్ ₹ 36.54 కోట్లు
    2017: ట్యూబ్ లైట్ ₹ 21.15 కోట్లు
    2018: రేస్ 3 ₹ 29.17 కోట్లు
    2019: భారత్ ₹ 42.30 కోట్లు

    పాజిటివ్ టాక్, రివ్యూలు

    పాజిటివ్ టాక్, రివ్యూలు

    ‘భారత్' చిత్రానికి పాజిటివ్ రివ్యూలతో పాటు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. కథలోని ఎమోషనల్ జర్నీ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కమెడీతో పాటు ఎమోషన్స్ బాగా మిక్స్ చేశాడు. సల్మాన్ ఖాన్ నటన, కత్రినా కైఫ్ నటనతో పాటు గ్లామర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ చిత్రం దిశా పటానీ, జాకీ ష్రాఫ్, టబు ఇతర ముఖ్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

    English summary
    Salman Khan's Bharat has earned Rs 42.3 crore on its opening day. "Salmania grips the nation... Bharat storms the BO... Proves yet again. Salman Khan is the biggest crowd puller, Bharat opens much bigger than Salman - Ali Abbas Zafar’s #TigerZindaHai [₹ 34.10 cr] and #Sultan [₹ 36.54 cr]... Wed ₹ 42.30 cr. India biz." Taran Adarsh tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X