»   » ఫ్యాన్సు కు పండుగ: రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వీడియో విడుదల

ఫ్యాన్సు కు పండుగ: రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వీడియో విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న నూతన చిత్రం 'సుల్తాన్‌'. ఈ చిత్రానికి అలీ అబ్బాస్‌ దర్శకత్వం వహించనున్నారు. సుల్తాన్‌ చిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్‌ పండుగకు విడుదల చేయనున్నట్లు యశ్‌ఫిల్మ్స్‌ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సల్మాన్‌ సరసన దీపికా పదుకొణె, కంగనా రనౌత్‌లను అనుకున్నా కుదరలేదు. ప్రస్తుతం కృతి సనన్‌ను ఆ పాత్రకు తీసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. తాజా ఈద్‌కు సల్మాన్‌ఖాన్‌ 'భజరంగీ భాయి జాన్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Salman Khan's Wrestling Film Sultan Has Eid 2016

సల్మాన్ తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' విషయానికి వస్తే...

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు ఆయన తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంజాన్ కానుకగా జులై 17న సినిమా విడుదల కానుంది. తాజా ఈ చిత్రం అపీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోంది.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్లో కరీనా కపూర్ ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇందులో ఆమె రాశిక పాత్రలో నటిస్తోంది. మరో పాత్రధారి నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో పాకిస్థాన్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి.

English summary
Yash Raj Films made the official announcement of Salman Khan's Sultan date on Twitter Caption: Salman Khan photographed at the Mumbai airport. Bollywood superstar Salman Khan will star in and as Sultan on Eid 2016, Yash Raj Films has confirmed on microblogging site Twitter.
Please Wait while comments are loading...