»   » బ్రహ్మాండం: బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన ‘సంజు’

బ్రహ్మాండం: బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టిన ‘సంజు’

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sanju Beats Baahubali 2 Records In Australia

  రణబీర్ కపూర్ హీరోగా సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'సంజు' ఆస్ట్రేలియా బాక్సాఫీసు వద్ద బాహుబలి 2ను మించిన వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయమై ట్వీట్ చేస్తూ.... 'సంజు' మూవీ బాహుబలి2(హిందీ) లైఫ్ టైమ్ రికార్డును అధిగమించింది. ఆస్ట్రేలియాలో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన మూడవ హిందీ చిత్రంగా నిలిచిందని తెలిపారు.

  బాహుబలి2 రికార్డు బద్దలు

  బాహుబలి2 రికార్డు బద్దలు

  సంజు మూవీ 38 రోజుల్లో టోటల్ A$2,409,125 లియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో ‘బాహుబలి 2' లైఫ్‌టైమ్ రికార్డును అధిగమించినట్లయింది. బాహుబలి 2 ఆస్ట్రేలియాలో A$ 2,407,933 వసూలు చేసింది.

   టాప్ 5 మూవీస్ ఇవే

  టాప్ 5 మూవీస్ ఇవే

  ఆస్ట్రేలియాలో విడుదలైన హిందీ చిత్రాల్లో పద్మావత్ A$ 3,163,107 వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత దంగల్ మూవీ A$ 2,623,780 3తో రెండో స్థానంలో ఉంది. A$ 2,110,841 వసూళ్లతో ‘పికె'... సంజు, బాహుబలి 2 తర్వాతి స్థానం ఆక్రమించుకుంది.

  యూఎస్ఏ తర్వాత ఆస్ట్రేలియా

  యూఎస్ఏ తర్వాత ఆస్ట్రేలియా

  యూఎస్ఏ తర్వాత హిందీ సినిమాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఆస్ట్రేలియాను పేర్కొంటారు. ఇక్కడ రాజ్ కుమార్ హిరానీ, రణబీర్ కపూర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ రావడంతో తొలి రోజు నుండే వసూళ్ల మోతెక్కిపోతున్నాయి.

   ‘సంజు' వసూళ్లు

  ‘సంజు' వసూళ్లు

  సంజు ఇక్కడ విడుదలైన ఫస్ట్ వీకెండ్ రూ. 4.71 కోట్లు (A$931,947)వసూలు చేయడం ద్వారా అద్భుతమైన ఓపెన్సింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తొలివారం పూర్తయ్యే సమయానికి ఓవరాల్ వసూల్లు A$1,487,605కు చేరుకుంది.

   ఆ సినిమాలు వచ్చినా

  ఆ సినిమాలు వచ్చినా

  రెండో వారం A$668,598 వసూలు చేయడంతో 14 రోజుల్లో ఓవరాల్ కలెక్షన్ 2 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత ధడక్, సాహెబ్ బివి ఔర్ గ్యాంగస్టర్ 2, కార్వాన్, ఫన్నే ఖాన్, ముల్క్ లాంటి చిత్రాలు విడుదలైనా వసూల్లు ఆశాజనకంగానే ఉన్నాయి.

  English summary
  Ranbir Kapoor's Sanju has crossed the A$2.4 million mark at the Australia box office in 38 days and shattered the lifetime collection record of SS Rajamouli's Baahubali 2 (Bahubali 2). Taran Adarsh tweeted, "This is MASSIVE... #Sanju crosses *lifetime biz* of #Baahubali2 [Hindi] in AUSTRALIA... Now THIRD HIGHEST GROSSING *Hindi* film... 1 #Padmaavat A$ 3,163,107[IMAX, 3D, 2D] 2 #Dangal A$ 2,623,780 3 #Sanju A$ 2,409,125 4 #Baahubali2 *Hindi* A$ 2,407,933 5 #PK A$ 2,110,841 comScore (sic)."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more