»   »  'సరైనోడు' 4 రోజుల కలెక్షన్స్ ఇవీ..హిట్టా, ఫట్టా మీరే తేల్చుకోండి

'సరైనోడు' 4 రోజుల కలెక్షన్స్ ఇవీ..హిట్టా, ఫట్టా మీరే తేల్చుకోండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' సూపర్ ఫీట్ ను తన ఖాతాలో వేసుకుందని చిత్రం పీఆర్వో టీమ్ విడుదల చేసిన కలెక్షన్స్ చెప్తున్నాయి. ఆ లెక్కలు ప్రకారం...నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అంటే...సినిమాపై మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది వసూళ్లపై ప్రభావం చూపలేదనే అర్దమవుతోంది. బన్నీ పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యాన్స్ ను ఫిదా చేసిందని ,వారే సినిమాని మౌత్ టాక్ తో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్తున్నారు.

దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్న 'సరైనోడు' కలెక్షన్లతో బన్నీ రికార్డు సృష్టిస్తున్నాడని అంటున్నారు.బన్ని నటించిన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు రూ.50 కోట్ల మార్కును దాటేశాయి. అయితే ఈ సారి బన్ని సినిమా నాలుగు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం టాలీవుడ్ లో విశేషం గా వర్ణిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తమిళంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టి తొలిసారి తెలుగులో విలన్ గా కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిసాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరిశారు.

ఆ కలెక్షన్స్ ని ఏరియావైజ్ మనం ఇక్కడ చూద్దాం...

నైజాం

నైజాం

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 8.45 కోట్లు నైజాం ఏరియాలో కలెక్ట్ చేసింది

సీడెడ్

సీడెడ్

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 5.11 కోట్లు సీడెడ్ ఏరియాలో కలెక్ట్ చేసింది

నెల్లూరు

నెల్లూరు

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 1.05 కోట్లు నెల్లూరు ఏరియాలో కలెక్ట్ చేసింది

గుంటూరు

గుంటూరు

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 2.50 కోట్లు గుంటూరు ఏరియాలో కలెక్ట్ చేసింది

కృష్ణా

కృష్ణా

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 1.67 కోట్లు కృష్ణా ఏరియాలో కలెక్ట్ చేసింది

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 2.95 కోట్లు ఉత్తరాంధ్ర ఏరియాలో కలెక్ట్ చేసింది

పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 1.96 కోట్లు పశ్చిమ గోదావరి ఏరియాలో కలెక్ట్ చేసింది

తూర్పు గోదావరి

తూర్పు గోదావరి

సరైనోడు చిత్రం నాలుగు రోజుల్లో 2.10 కోట్లు తూర్పు గోదావరి ఏరియాలో కలెక్ట్ చేసింది

English summary
Allu Arjun's Sarainodu, in the direction of Boyapato Srinu, though had opened to mixed reviews and average word of mouth, it sustained from the second day and racing towards a blockbuster. According to the numbers released by the film's PR team, it collected a total share of 25.79 Cr in Andhra Pradesh and Telangana alone, after its 4 days of release, while it collected $678k in USA after Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X