»   » ‘సర్దార్ గబ్బర్ సింగ్’: ఆడియో పోస్టర్ వచ్చేసింది, ఇదిగో

‘సర్దార్ గబ్బర్ సింగ్’: ఆడియో పోస్టర్ వచ్చేసింది, ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఆడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సర్దార్ ఆడియో రిలీజ్ ఎప్పుడు జరగనుందీ? ఎక్కడ జరగనుందీ? వంటి విషయాలు ఫ్యాన్స్ బాగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయమై తాజాగా సర్దార్ నిర్మాత శరత్ మరార్ ఒక క్లారిటీ ఇచ్చేస్తూ ఆయనో పోస్టర్ విడుదల చేసారు.

Also Read: 'సర్దార్' ఇంట్రడక్షన్ సీన్ ఇదేనా! (లీక్ ఫోటోస్)కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో సంజన ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. లక్ష్మి రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తూ,సినిమాని మలుపు తిప్పే కొన్ని సన్నివేశాల్లో కనిపించనుంది.


చాలా రోజుల తర్వాత పవన్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో 'సర్దార్ గబ్బర్ సింగ్‌'పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింతగా పెంచింది.


'పవర్' ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తున్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఈ కొత్త పోస్టర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.


English summary
Pawan Kalyan's 'Sardaar Gabbar Singh' audio posters have come out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu